కేజ్రీవాల్ ప్రజాదర్బార్..!

Wednesday, February 18th, 2015, 10:53:40 PM IST


పూర్వకాలంలో ప్రజల బాగోగుల గురించి తెలుసుకునేందుకు రాజులు, మంత్రులు, అధికారులు ప్రజాదర్భారును నిర్వహించి ప్రజల సమస్యలను తెలుసుకునేవారు. వారి సమస్యలను నేరుగా తెలుసుకొని… వీలయితే అక్కడికక్కడే పరిష్కారం చూపేవారు. కాలం మారింది… రాచరిక వ్యవస్థ స్థానంలో రాజకీయ వ్యవస్థ వచ్చింది. రాజకీయ వ్యవస్థలో ప్రజాసమస్యలు ఏమాత్రం నెరవేరుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. కాగా, ప్రజాసమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు ఢిల్లీలో అధికారం చేపట్టిన సామాన్యుడు ప్రజాదర్భార్ ను నిర్వహిస్తామని గతంలో చెప్పిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా కేజ్రీవాల్ ఈరోజు ఢిల్లీలోని గజియా బాద్ లోని పార్టీ కార్యాలయంలో ప్రజాదర్భార్ ను నిర్వహించారు. దాదాపు రెండు గంటల పాటు ఈ దర్భార్ జరిగింది. ఈ దర్భాలో 200మంది ప్రజలు పాల్గొని తమ సమస్యలను ముఖ్యమంత్రితో తెలియజేశారు.