అంగ్ సాన్ సూక్యీతో మోడీ భేటీ

Thursday, November 13th, 2014, 03:35:43 AM IST


భారతదేశ ప్రధానమంత్రి నరేంద్రమోడీ మయన్మార్ లో జరుగుతున్న 12వ ఏషియన్ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్న అనంతరం పలువురు నేతలతో భేటి అయ్యారు. ఈ క్రమంలో మయన్మార్ ప్రతిపక్ష నేత, నోబెల్ పురస్కార గ్రహీత అంగ్ సాన్ సూక్యీతో ప్రధాని మోడీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ అంగ్ సాన్ సూక్యీని భారత్ కు ఆహ్వానించారు. ఇక భారత్ తో తనకున్న అనుబంధం చాలా గొప్పదని, భారత్ తనకు మరో ఇల్లు లాంటిదని సూక్యి పేర్కొన్నారు. కాగా అంగ్ సాన్ సూక్యీ ఢిల్లీలోని లేడీ శ్రీరాం కళాశాలలో చదువుకున్నారు.