505 పరుగుల వద్ద ఆస్ట్రేలియా ఆల్ అవుట్!

Friday, December 19th, 2014, 12:09:00 PM IST


భారత్-ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 505 పరుగులకు ఆల్ అవుట్ అయ్యింది. కాగా ఈ మ్యాచ్ లో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే రెండు టీంలు కూడా సరిగా 109.4 ఓవర్లకే ఆలౌట్ అయ్యాయి. ఇక తొలి ఇన్నింగ్స్ లో 97పరుగుల ఆధిక్యాన్ని సాధించడంతో ఆస్ట్రేలియా జట్టు మంచి స్థితికి చేరుకుంది. ఈ స్కోర్ ను సమం చేసి ఆస్ట్రేలియా ముందు భారీ లక్ష్యాన్ని ఉంచాలంటే భారత్ టాప్ ఆర్డర్ లో నిలదోక్కుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ విషయంలో ఏమాత్రం తేడా జరిగినా రేపు సాయంత్రానికే మ్యాచ్ ముగిసే అవకాశముంది.

కాగా ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో 505 పరుగులకు ఆల్ అవుట్ అవ్వడంతో కీలకమైన 97 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. ఇక ఆస్ట్రేలియన్ టెయిలెండర్లను అవుట్ చెయ్యడానికి భారత్ బౌలర్లు శ్రమ పడాల్సి వచ్చింది. కాగా చివరి వికెట్ గా స్టార్క్ 52 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద అవుట్ అవ్వగా 11వ నెంబర్ బ్యాట్స్ మెన్ గా క్రీజులోకి వచ్చిన హ్యాజిల్ వుడ్ 32 పరుగులతో నాటౌట్ గా నిలిచారు.