మహాఘోరానికి 22ఏళ్ళు

Saturday, December 6th, 2014, 02:00:38 AM IST


బాబ్రీ మసీదు విధ్వంసం జరిగి డిసెంబర్ 6వ తేదీకి 22 ఏళ్లు అవుతున్నది. బాబ్రీ మసీద్ కుల్చివేతను దేశం బ్లాక్ డేగా గుర్తించిన విషయం తెలిసిందే. కాగా, హైదరాబాదు సహా దేశంలోని పలు ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఇక, సున్నిత ప్రాంతాల్లో బందోబస్తును మరింత పెంచారు.

ఇప్పటికే హైదరాబాదులోని పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో పోలీసులు కవాతు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తున్నట్టు పోలీసులు తెలియజేస్తున్నారు. బేగంబజారు, సుల్తాన్ బజార్ లలో పోలీసులు తనిఖీ చేశారు. ఇక్కడ నిరసనకారులు రెక్కీ నిర్వహించినట్లుగా అనుమానం రావడంతో పోలీసులు ఈ విధమైన చర్యలుతీసుకున్నారు . పలు సంస్థలు శనివారం బ్లాక్ డే నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. అయితే…నిరసన కారులు నిరసన ర్యాలీకి పోలీసులు అనుమతిని ఇవ్వలేదు. అంతేకాకుండా, తమిళనాడు, ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్ తదితర అన్ని రాష్ట్రాలలోను సున్నిత ప్రాంతాలలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. తమిళనాడులో దాదాపు అరవై వేల మంది పోలీసులను మోహరించనున్నారు. ఒక్క చెన్నైలోనే 18,000 మంది పోలీసులను మొహరించి పహారా కాస్తున్నారు. హైదరాబాదు నగర పౌరులకు నగర పోలీసులు ముందస్తు ఎస్సెమ్మెస్ సందేశాలు పంపించినట్లు సమాచారం.