అతీంద్రియ శక్తుల కోసం చిన్నారి నరబలి…….

Tuesday, November 6th, 2018, 10:15:18 PM IST

మనుషులందరినీ, మరియు మనిషి లోని నమ్మకాలని గెలవాలనే మూర్ఖ ఆశ తో ఓకే నాలుగేళ్ల చిన్నారిని బలి తీసుకుందో ఒక మూర్ఖురాలు. మనిషిలోని మూఢనమ్మకాలకు, శక్తిమంతురాలైన మంత్రగత్తెను కావాలన్న స్వార్థానికి పాపం నాలుగేళ్ళ చిన్నారి నరబలి పాలైంది. నిందితురాలి అరెస్ట్‌తో ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చెన్నై లోని పుదుకోట్టై జిల్లా కరుంపట్టికి చెందిన పళనిస్వామి భవన నిర్మాణ కార్మికుడు. ఇతని కుమార్తె షాలిని(4) గతనెల 25న ఇంటిదగ్గర ఆడుకుంటు కనిపించకుండా పోయింది. వాళ్ళ ఇంటికి ఒక కిలోమీటర్ దూరంలో బ్లేడుతో గొంతుకోసిన స్థితిలో హత్యకు గురై ఉండగా స్థానికులు గుర్తించారు. శవం దొరికిన ప్రదేశంలో సెమ్ముని ఆలయం ఉండడంతో బాలికను బలి చేశారనే కోణంలో ఇలుప్పూరు పోలీసులు విచారణ ప్రారంభించారు. అదే ప్రాంతానికి చెందిన సోది చెప్పే శింగారం భార్య చిన్నపిల్లై (47) అనే మహిళను అదుపులోకి తీసుకుని విచారించారు.

ఆమె చేతిలో సైతం బ్లేడుతో కోసుకున్నట్లుగా గాయం ఉండడంతో విచారణను తీవ్రతరం చేసి చిన్నపిల్లైని సోమవారం అరెస్ట్‌ చేశారు. గగుర్పొడిచే వివరాలతో పోలీసులకు ఆమె వాంగ్మూలం ఇచ్చింది. చిన్నారి షాలిని ఇంటికి సమీపంలోనే కొన్నేళ్లుగా నేను నివసిస్తున్నాను. దేవుడి పూనినట్లుగా ఆడడం, సోది చెప్పడం వంటి చేస్తూ జీవనం సాగిస్తున్నాను. సమీపంలోని అడవిలో ఉన్న సెమ్ముని ఆలయంలో కోడి, పొట్టేలు, గొర్రెలను బలిఇచ్చి సోది చెబుతుంటాను. నరబలి ఇవ్వడం ద్వారా నా మంత్రశక్తి పెంచుకోవాలని భావించాను. ఇందుకు చిన్నారి షాలినీని ఎంచుకున్నాను. షాలినీని ఎత్తుకెళ్లేందుకు సమయం కోసం ఎదురుచూస్తుండగా గతనెల 25వ తేదీన ఒంటరిగా ఆడుకుంటోంది, జనసంచారం పెద్దగా లేకపోవడంతో షాలినీని చంకనవేసుకున్నాను. నేను బాగా పరిచయం ఉండడంతో మారం చేయకుండా నాతో వచ్చేసింది. నేరుగా సెమ్ముని ఆలయంకు వెళ్లి పూజలు చేసి నా వద్దనున్న బ్లేడుతో షాలిని గొంతుకోసి బలిచ్చాను. ఆ తరువాత శవాన్ని ఆలయానికి దూరంగా విసిరివేసి ఇంటికి వెళ్లిపోయాను’’ అని వివరించింది. మంత్రగత్తె చిన్నపిల్లైౖని తిరుమయం కోర్టులో ప్రవేశపెట్టిన అనంతరం తిరుచ్చిరాపల్లి జైల్లో పెట్టారు.