బాలయ్యతో పవన్ చేతులు కలుపుతారా..?

Friday, December 11th, 2015, 11:48:17 AM IST


బాలకృష్ణ సినిమాలతో బిజీగా ఉంటూనే.. మరోవైపు రాజకీయాలలో కూడా బిజీగా ఉన్నారు. సమయం దొరికినప్పుడల్లా బాలకృష్ణ హిందూపురంలో పర్యటిస్తూ.. అక్కడి ప్రజల సమస్యల గురించి తెలుసుకుంటున్నారు. సమస్యలు తీర్చేందుకు తీసుకోవలసిన చర్యల గురించి ఎప్పటికప్పుడు అధికారులతో చర్చించి పరిష్కారం చూపుతున్నారు. ఇక, పవన్ కళ్యాణ్ కూడా ఇదే బాటలో ఉన్నారు. సినిమా బిజీతో పాటు పవన్ రాష్ట్ర రాజకీయాలలో ఒక కీలక వ్యక్తిగా ఉన్నారు. పవన్ జనసేన పార్టీ సారధ్య బాధ్యలు అదనం. అయినప్పటికీ రెండు పనులను సమర్ధవంతంగా నిర్వహిస్తున్నారు. రాజధాని భూముల రైతుల విషయంలో మద్దతు ఇచ్చిన ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసేందుకు కూడా పవన్ వెనుకడటంలేదు.

ఇకపోతే.. ఈ ఇద్దరు నేతలు ఒకచోట.. ఒక్కటిగా చేతులు కలిపితే.. అది బాలయ్య ఫ్యాన్స్ కు, పవన్ ఫ్యాన్స్ కు పెద్ద పండగే అని చెప్పుకోవచ్చు. రాజకీయ పరంగా కూడా అది మంచిదే. డిక్టేటర్ సినిమా ఆడియో వేడుకకు పవన్ కళ్యాణ్ ను చీఫ్ గెస్ట్ గా పిలుస్తారనే వార్తలు మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి. ఇది ఎంతవరకు నిజమో తెలియదు. మీడియాలో వార్తలు వస్తున్నట్టుగా పవన్ కళ్యాణ్ ను చీఫ్ గెస్ట్ గా పిలిస్తే.. అందుకు పవన్ అంగీకరిస్తే.. అమరావతి శంకుస్థాపన తరువాత.. డిక్టేటర్ ఆడియో వేడుక కన్నుల పండుగగా జరుగుతుంది అనడంలో సందేహం లేదని చెప్పొచ్చు.