కేసీఆర్, చంద్రబాబు ‘అలయ్ బలయ్’

Thursday, October 2nd, 2014, 11:20:23 AM IST


తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒకే చోట కనిపించడం ఈ మధ్య హాట్ టాపిక్ అవుతోంది. మరోసారి ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం కేసీఆర్ ఒకే వేదికను పంచుకోబోతున్నారు. దసరా ఉత్సవాల్లో సందడి చేయబోతున్నారు.

సికింద్రాబాద్ ఎంపీ బండారు దత్తాత్రేయ దసరా సందర్భంగా ప్రతి ఏడాది ‘అలయ్ బలయ్’ఉత్సవాన్ని నిర్వహిస్తారు. తెలంగాణ సంస్కృతి, వారసత్వాన్ని అద్దం పట్టేలా ఈ ఉత్సవం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత జరుగుతున్న తొలి ‘అలయ్ బలయ్’ కావడంతో ఈ ఏడాది ఈ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి కేసీఆర్, చంద్రబాబు, వెంకయ్య నాయుడులతోపాటు గవర్నర్ నరసింహన్, కేంద్ర మంత్రివర్గంలోని మరికొంతమంది సీనియర్ మంత్రులు కూడా పాల్గొంటారని బండారు దత్తాత్రేయ తెలిపారు.

గతంలో తెలంగాణ రాష్ట్ర ఉద్యమపాటలతో ‘అలయ్ బలయ్’ ధూమ్ ధామ్ గా జరిగేది. కానీ, ఈసారి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు కేంద్రమంత్రులు పాల్గొనడంతో ఈ కార్యక్రమం ఈ సారి కలర్ ఫుల్ గా మారనుంది.