శారద స్కాంలో బెంగాల్ మంత్రి అరెస్ట్

Friday, December 12th, 2014, 06:16:58 PM IST


సంచలనం సృష్టించిన శారదా చిట్ ఫండ్ స్కాం కేసులో పశ్చిమ బెంగాల్ రవాణా శాఖామంత్రి, తృణమూల్ కాంగ్రెస్ నేత మదన్ మిత్రాను సీబీఐ అరెస్ట్ చేసింది. కాగా శుక్రవారం మధ్యాహ్నం శారదా గ్రూప్ ఆఫ్ కంపెనీల గురించి ఐదు గంటల పాటు మదన్ మిత్రాను సీబీఐ అధికారులు విచారించారు. అనంతరం నేరపూరిత కుట్ర, మోసం, నిధుల దుర్వినియోగం వంటి ఆభియోగాలతో మదన్ మిత్రాను అదుపులోకి తీసుకున్నారు. ఇక కేసులో ఇప్పటికే అనేకమంది తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలను విచారించి అరెస్ట్ చేసిన సీబీఐ, దీనికి సంబంధించిన అధికారులను కూడా ప్రశ్నించారు.