“కౌశల్ ఆర్మీ” కాలర్ ఎగరేసేలా కౌశల్ నిర్ణయం హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..!

Tuesday, October 30th, 2018, 09:49:24 PM IST

బిగ్ బాస్ షో రెండో సీజన్ ముగిసి దగ్గరికి రెండు నెలలు కావస్తున్నా ఆ షోలో పాల్గొన్న ఏ ఒక్కరి పేరు వినబడకపోయినా కౌశల్ పేరు మాత్రం మారు మోగుతూనే ఉంది.అతని యొక్క వ్యక్తిత్వానికి దాసోహమయ్యి లక్షలాది మంది అతనకి అండగా నిలబడి కోట్లాది ఓట్లు వేసి భారీ మార్జిన్ తో అతన్ని గెలిపించుకున్నారు,ఆ తర్వాత కౌశల్ బయటకి వచ్చిన తర్వాత అడుగడుగునా అతని అభిమానులు కౌశల్ కు బ్రహ్మరథం పట్టారు.అతని యొక్క మినీ సైన్యం గా పిలవబడే “కౌశల్ ఆర్మీ” ఇప్పటికే ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారు.

అయితే ఇప్పుడు తాజాగా కౌశల్ తన అభిమానులు గర్వపడేలా ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు.తన అభిమానులతో పాటు తాను ఒక ఫౌండేషన్ ను స్థాపించాలనుకుంటున్నానని,ఆ సంస్థ ద్వారా తాను తన ఆర్మీ తో నిస్సహాయులకు అండగా ఉంటానని తెలిపారు.అంతే కాకుండా తాను శ్రీకాకుళం తుఫాను బాధితుల దగ్గరకు వెళ్లి అక్కడ కూడా కొన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలనుకుంటున్నానని,తన కౌశల్ ఆర్మీ అండతో అక్కడ నష్టపోయినటువంటి ఒక గ్రామాన్ని తాను దత్తత తీసుకుంటానని తెలిపారు.ఇప్పటికే కౌశల్ తాను బిగ్ బాస్ లో గెలుచుకున్నటువంటి డబ్బు అంతటిని దానం చేసేసారు,ఇప్పుడు మళ్ళీ ఇంత మంచి నిర్ణయం తీస్కొని మరో మెట్టు పైకి ఎక్కేసారు.