భగవత్ గీత జాతీయ గ్రంధమా..?

Monday, December 8th, 2014, 05:49:12 PM IST


భగవత్ గీత…ఐదువేల సంవత్సరాల క్రితం నాటి మహాగ్రంధం. ఇప్పుడు ప్రస్తుతం దేశంలో ఈ పుస్తకంపై చర్చనడుస్తున్నది. శ్రీకృష్ణ భగవానుడు కురుక్షేత్ర యుద్దంలో అర్జునుడికి బోధించిన బోధ. ఇందులో సర్వమానవాళి సమస్యలకు పరిష్కారం ఉన్నది. అందుకే గీత ఇప్పటికీ చలామణిలో ఉన్నది. వివేకానంద.. మహాత్మాగాంధి వంటి మహానుభావులు నిత్యం గీతను పారాయణ చేసేవారు.

ఇక నిన్న విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ భగవత్ గీత… ప్రపంచంలోని సర్వమానవాళి సమస్యలకు పరిష్కారం చూపగల మహాగ్రంధం అని అన్నారు. అంతేకాకుండా… దాదాపు ఐదువేల సంవత్సరాల చరిత్రగలిగిన ఈ గీతవంటి మహా గ్రంధం మరొకటి లేదని ఆమె తెలిపారు. భగవత్ గీతను జాతీయ గ్రంధంగా ప్రకటించే ఆలోచనలో ఉన్నట్టు సుష్మాస్వరాజ్ మాటలను బట్టి తెలుస్తున్నది.

నిన్న సుష్మాస్వరాజ్ భగవత్ గీత గురించి… భగవత్ గీతను జాతీయ గ్రంధంగా చేయాలని ఆమె చేసిన సూచనలు గురించి ఈ రోజు ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. బీజేపి ఆలోచనా తీరుమార్చుకోవాలని అన్నారు. ఇది దేశ ఐకమత్యానికి దెబ్బతీసే విధంగా ఉన్నదని సిపీఐ పార్టీ జాతీయ నేత డి రాజా అన్నారు. కేవలం బీజేపి పబ్లిసిటీ కోసమే వ్యాఖ్యలు చేస్తున్నదని జనతాదళ్ (యు) నేత ఆలీ అన్వర్ అన్నారు.