దేశంలో కళ కోల్పోతున్న ‘కమలం’

Sunday, December 27th, 2015, 03:07:32 PM IST


మొన్న ఢిల్లీ, నిన్న బీహార్, నేడు మధ్యప్రదేశ్. దేశంలో బీజేపీ వరుస పరాజయాలను చూస్తూ నెమ్మదిగా తన కళను కోల్పోతోంది. కుప్పకూలిపోయింది అనుకున్న కాంగ్రెస్ మాత్రం నెమ్మదిగా పుంజుకుంటూ బీజేపీకి తలనొప్పిగా మారుతోంది. బీహార్ ఓటమి తరువాత అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్ లో కూడ బీజీపీకి షాకెదురైంది. మధ్యప్రదేశ్ లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ అయిదు మున్సిపాలిటీల్లో అధికారం చేపట్టగా బీజ్ఫీ కేవలం మూడింటిలో మాత్రమే అధికారం చేపట్ట గల్గింది.

మున్సిపల్ ఎన్నికలు జరిగిన షాజాపూర్ కౌన్సిల్, బేధాఘాట్, మాఘౌలీ, ధమ్నోద్, ఒర్చానగర్ పంచాయితీల్లో కాంగ్రెస్ విజయం సాదించగా బీజేపీ కేవలం మూడింటిలో మాత్రమే విజయం సాదించింది. మొత్తంగా బీజేపీ 93 స్థానాల్లో నేగ్గినప్పటికీ, 60 వార్డులు మాత్రమే గెలుచుకున్న కాంగ్రెస్ 5 మున్సిపాలిటీల్లో అధికారం చేపట్టటం విశేషం. ఈ ఓటమి బీజేపీ దేశంలో ప్రభను కోల్పోతోందనటానికి ఒక నిదర్శనం.