డ్రగ్ కేసులో బాలివుడ్ నటి అరెస్ట్

Thursday, November 13th, 2014, 04:48:10 PM IST


90వ దశకంలో బాలివుడ్ ను ఏలిన నటిమణి మమతాకులకర్ణి గత దశాబ్దకాలంగా మీడియాకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ బాలివుడ్ నటి డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయింది. అయితే ఇది జరిగింది ఇక్కడ కాదు.. కెన్యాలో. కెన్యాలోని నైరోబిలో ఈ సంఘటన జరిగింది. ఇక వివరాలలోకి వెళ్తే..
మమతాకులకర్ణి… తన స్నేహితుడు.. అంతర్జాతీయ డ్రగ్స్ వ్యాపారి విజయ్ విక్కీ గోస్వామీతో కలిసి ఆమె దుబాయ్ వేల్లిపోయినట్టు అప్పట్లో వార్తలు వెలువడ్డాయి. ఈ వార్తలు వెలువడ్డాక ఆమె విజయ్ ను పెళ్లచేసుకున్నది. అయితే.. 1997లో విజయ్ ను డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేశారు.. ఈ కేసులో అతనికి 25సంవత్సరాల జైలు శిక్షపడింది. విక్కీని చూసేందుకు మమతా మారువేషంలో జైలుకు కూడా వెళ్ళింది. కాని, మీడియా ఆమెను గుర్తు పట్టి ఫోటోలు కూడా ప్రచురించింది. అయితే.. సత్పవర్తన కారణంగా గత సంవత్సరం నవంబర్ 15న విక్కీని దుబాయ్ జైలు నుంచి విడుదల అయ్యారు. అనంతరం వీరు కెన్యా వెళ్ళిపోయారు. తాజాగా డ్రగ్స్ కేసులో వీరిని కెన్యాలోని నైరోబీ పోలీసులు అరెస్ట్ చేశారు.