16 ఏళ్ల మైనర్ బాలుడిని రేప్ చేసిన బాలీవుడ్ హెయిర్ స్టైలిస్ట్ బ్రెండన్ అలిస్టర్ అలిస్టెర్ డీజీ (42)ని ముంబై – ఖర్ పోలీసులు అరెస్టు చేయడం సంచలనమైంది. సదరు బాలుని తల్లి ఫిర్యాదు మేరకు అతడిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి పోస్కో పేరుతో అరెస్టు చేయడం ప్రస్తుతం ముంబైలో చర్చకు తావిచ్చింది. బ్రెండన్ ఓ నపుంసకుడు. మగవాళ్లతో శృంగారంలో పాల్గొంటాడని కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు తెలిపారు.
అలా ఓ మైనర్ బాలుడితో శృంగారంలో పాల్గొనడం అత్యాచార నేరం అవుతుంది కాబట్టి అతడిపై పోలీసులు పోస్కో కేసు పెట్టి దర్యాప్తు సాగిస్తున్నారు. ఈ కేసులో మరో ఆసక్తికర విషయం బయటపడింది. బ్రెండన్‌తో శృంగారం చేసిన సదరు టీనేజీ బాలుడు కూడా ఓ నపుంసకుడా? అన్న కోణంలోనూ దర్యాప్తు సాగుతోంది. ఓ ఆన్లైన్ డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైన దాదాపు 15 మంది యువకులతో సదరు టీనేజీ బోయ్ శృంగారంలో పాల్గొనడం ఈ కేసులో అసలు ట్విస్టు. తన కుమారుడిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న తల్లి నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ కేసును ముంబై పోలీసులు ఛాలెంజ్‌గా తీసుకున్నారు. 2017 నుంచి సాగుతున్న ఈ భోగోతాన్ని పూర్తి స్థాయిలో పోలీసులు దర్యాప్తు చేసి నేరస్తుడిని అరెస్టు చేశారు. ఆసక్తికరంగా సదరు స్టైలిష్ట్ బాలీవుడ్ లో కంగన సినిమాలకు హెయిర్ స్టైలిస్ట్ గా పని చేస్తున్నాడట. అలానే పలు బాలీవుడ్ చిత్రాలకు పని చేస్తున్నాడు. గోవాలోని పలు డ్రగ్స్ గ్యాంగులతో అతడికి సంబంధాలు ఉన్నాయన్న విషయాన్ని దర్యాప్తులో నిగ్గు తేల్చారు పోలీస్.