అమెరికా ఎంబసీ వద్ద పేలుడు.. వణికిన చైనా రాజధాని!

Thursday, July 26th, 2018, 03:39:48 PM IST

బాంబు పేలుడుతో చైనా రాజధాని బీజింగ్‌ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అది కూడా అమెరికా రాయబార కార్యాలయం దగ్గరే పేలడం అనేక అనుమానాలకు తావిస్తోంది. గురువారం ఉదయం ఎంబసీ సమీపంలో గట్టిగా శబ్దాలు వినపడటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.పేలుడుకు పాల్పడిన వ్యక్తిని వెంటనే పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో చైనాకు చెందిన 26 ఏళ్ల యువకుడే ఘటనకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఘటనలో నిందితుడు తప్పితే ఎవరికీ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. పేలుడు సంభవించిన ప్రాంతానికి దగ్గరలో భారత రాయబార కార్యాలయం కూడా ఉంది. అమెరికా ఎంబీసీ వద్ద ఓ మహిళ కిరోసిన్ పోసుకొని నిప్పటించుకుందని పలు మీడియాల్లో కథనాలు వెలువడుతున్నాయి. ఇక పేలుడికి కారణమైన వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ ఘటనకు గల అసలైన కారణాలను పోలీసులు ఇంకా వెల్లడించలేదు.