బాయ్ ఫ్రెండ్ కోసం రహస్య వీడియోలు.. చివరికి మూల్యం చెల్లించుకుంది!

Wednesday, September 5th, 2018, 12:01:23 PM IST

ప్రియుడిని నమ్మిన ఓ యువతి చేసిన తప్పుకు మూల్యం చెల్లిచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. గుడ్డిగా ప్రేమను నమ్మి ఇతరుల జీవితాల్లో దుఃఖాన్ని నింపారు. పోలీసులకు విషయం తెలియడంతో బాయ్ ఫ్రెండ్ తో పాటు సహకరించిన ప్రియురాలిపై కూడా కేసు నమోదైంది. అసలు వివరాల్లోకి వెళితే.. తమిళనాడుకు చెందిన సిద్ధార్థ్‌ (21) అనే యువకుడు స్థానికంగా ఉండే యువతికి మాయమాటలు చెప్పి ప్రేమలోకి దింపాడు.

ప్రేమను నమ్మిన యువతి అతని కోరిక మేరకు తన నగ్న పోటోలను వీడియోలను పంపింది. అయితే సిద్దార్థ్ కొన్ని రోజుల తరువాత తన అసలు రంగును బయటపెట్టాడు. యువతిని వేధించడం మొదలుపెట్టాడు. యువతి ఉంటున్న హాస్టల్ బాత్రూమ్ లో సీక్రెట్ కెమెరాలు ఉంచాలని బెదిరించాడు. లేకుంటే నా దగ్గర ఉన్న నీ నగ్న చిత్రాలను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తానని బ్లాక్ మెయిల్ చేయడంతో ఆ యువతి వేరే దారిలేక బయపడి అతను చెప్పినట్టు చేసింది. ఆ విధంగా ముగ్గురి యువతుల వీడియోలు పంపింది. బాధిత మహిళల్లో ఒక ఆంధ్రప్రదేశ్ అమ్మాయి కూడా ఉంది. ఇక కొన్ని రోజుల అనంతరం విషయం బయటకు రావడంతో పోలీసులు తెలిసింది. ఇద్దరిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు.