హైదరాబాద్ బాలానగర్లో హత్య…

Friday, March 2nd, 2018, 04:54:55 PM IST

అనుమానాలు, అపోహలతో నిండు నూరేళ్ళు బ్రతకాల్సిన వాళ్ళు ఓవైపు ప్రాణాలు కోల్పోతుంటే మరోవైపు పెళ్ళిళ్ళు చేస్కొని కుడా రహస్య ప్రేమ వ్యవహారాలు నడుపుతూ హత్యలకు పాల్పడుతున్నవాళ్ళు ఇంకొందరు. ఈరోజు హైదరాబాద్, బాలానగర్‌లో అతి దారుణం చోటు చేసుకుంది. ఓ మహిళ తన ప్రియుడుతో కలిసి భర్తను హతమార్చింది. బాలానగర్‌లో నివాసం ఉంటున్న తులసి, జగదీశ్వర్‌రావు భార్యాభర్తలు. ప్రియుడి మోజులో పడిన తులసి భర్తను అడ్డు తొలగించుకునేందుకు ప్రియుడితో కలిసి భర్తను కిరాతకంగా హత్య చేసింది. అనంతరం తన భర్త జగదీశ్వర్‌రావుకు గుండెనొప్పి రావడంతో చనిపోయాడంటూ కొత్త కథను సృష్టించింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటనా ప్రదేశానికి చేరుకుని పోస్టుమార్టం నిమిత్తం మృత దేహాన్ని ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం పరీక్షల్లో అది గుండెపోటు కాదని, అది హత్య అని వైద్యులు తేల్చిచెప్పారు. దీంతో నిందితులు తులసి, ప్రియుడు వీరబాబును పోలీసులు అరెస్ట్‌ చేసి విచారణ జరుపుతున్నారు. పోస్టుమార్టం అయిన వెంటనే జగదీశ్వర్‌రావు భౌతిక కాయాన్ని అతని తల్లిదండ్రులకు అప్పగిస్తామని డాక్టర్లు వెల్లడించారు.