కర్నూల్ జిల్లాలో కలకలం..చంపి గుండె ఎత్తుకెళ్లిపోయారు..!

Thursday, November 8th, 2018, 02:10:46 PM IST

గత కొద్ది నెలల నుంచి ఇరు తెలుగు రాష్ట్రాల్లో పరువు హత్యలు మరియు పాత కక్షల హత్యలు కలకలాన్ని రేపాయి.నడి రోడ్డు మీదనే విచక్షణా రాహిత్యంగా అత్యంత దారుణంగా నరికి చంపిన సంఘటనలు ప్రజలను భయాందోళనలకు గురి చేశాయి.ఇక అవి అన్ని మర్చిపోయే లోపునే మళ్ళీ ఆంధ్ర రాష్ట్రంలో కర్నూల్ జిల్లాలో మరో ఘోర సంఘటన ప్రజలను భయబ్రాంతులకు గురి చేసింది.తుంగభద్ర నది ఒడ్డు తీరాన చెన్నయ్య అనే వ్యక్తిని అత్యంత దారుణంగా హతమార్చి అతని శరీరాన్ని చీల్చి ఎవరో గుర్తు తెలీని వ్యక్తులు గుండెను ఎత్తుకెళ్లిపోయారు.ఇప్పుడు ఈ దారుణ సంఘటన అక్కడ ఒక్కసారిగా కలకలం రేపింది.

కర్నూల్ జిల్లా సంకల్ బాగ్ ప్రాంతంలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది.హత్యకు గురైన చెన్నయ్య అనే వ్యక్తి ముందు ఒక రౌడీ షీటర్ అని ఆ తర్వాత క్రమంగా మారిపోయి రోజువారీ కూలీగా జీవనం కొనసాగిస్తున్నాడని తెలుస్తుంది.అయితే గత రెండు నెలల క్రితం జరిగినటువంటి ఒక గొడవ కారణంగా ఎవరో గుర్తు తెలీని వ్యక్తులు ఈ రోజు ఉదయం ఈ ఘాతుకానికి పాల్పడినట్టు తెలుస్తుంది.ఈ విషయం తెలిసిన పోలీసులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

హత్య చేసినటువంటి వారు చెన్నయ్య శరీరాన్ని చీల్చి అతని గుండెని ఎందుకు తీసుకెళ్లారు అన్నది పెద్ద ప్రశ్నగా మారింది అని ఈ కేసును అన్ని కోణాల వైపు నుంచి దర్యాప్తు చేస్తామని తెలిపారు.అన్ని చెడు అలవాట్లు మానుకొని చెన్నయ్య మంచివాడిగా మారుతున్న సమయంలో వారి కొడుకుని ఎవరో చంపేశారని కన్నీరు మున్నీరు అవుతున్నారు.