బుల్లి ‘నారా’కు బులెట్ ప్రూఫ్ కారు!

Monday, April 20th, 2015, 12:10:07 PM IST


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్, బ్రాహ్మణి దంపతులకు మన్మధనామ సంవత్సర ఉగాది శుభ దినాన వారసుడు జన్మించిన సంగతి తెలిసిందే. కాగా ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు తన మనవడికి బులెట్ ప్రూఫ్ కారును కేటాయించారు. ఇక ప్రస్తుతం మరో తాత హిందూపూర్ ఎమ్మెల్యే, ప్రముఖ నటుడు బాలకృష్ణ ఇంట్లో ఉన్న ఈ నారా వారి వారసుడికి రక్షణ నిమిత్తం ఆదివారం నుండి ఈ కారును కేటాయించారు. కాగా మొన్నటి వరకు ముఖ్యమంత్రి చంద్రబాబు వినియోగిన స్కార్పియో బులెట్ ప్రూఫ్ కారునే ఇప్పుడు మనవడి రక్షణకు వినియోగిస్తున్నారు. ఇక ఇప్పటికే ‘నారా’. ‘నందమూరి’ ల ముద్దుల మనవడికి నలుగు కానిస్టేబుళ్ళను భద్రత నిమిత్తం కేటాయించిన సంగతి తెలిసిందే.