వైరల్ వీడియో : సూపర్ హీరోలా వచ్చి మహిళకు మళ్ళీ ప్రాణం పోసాడు…

Friday, March 16th, 2018, 02:07:59 AM IST

భూమి మీద నూకలు చెల్లకపోతే ఎన్ని ప్రయత్నాలు చేసిన ప్రాణం పోదు అన్న మాటకు నిదర్శనం ఇదే కావచ్చు. కొన్ని సందర్బాలలో మనుషులే సూపర్‌హీరోల్లా, సూపర్‌మెన్‌లా మారుతుంటారు. దేవుడే మనిషి రూపంలో వచ్చాడంటారు. ఇక్కడ ఓ సంఘటన ఇలాగే జరిగింది. ఓ పోలీస్ ఆఫీసరే దేవుడు, సూపర్ హీరో రూపంలో వచ్చి పైనుంచి గాల్లో దూకిన మహిళను గాల్లోనే పట్టుకొని కాపాడాడు. అయితే… ఈ ఘటనలో మహిళకు ఎటువంటి గాయాలు కాకున్నా… పోలీస్ మీద ఆ మహిళ పడటంతో ఆయనకు తీవ్రంగా గాయాలయ్యాయి. వెన్నముక ప్రాంతంలో చిన్న గాయాలు కాగా.. వెంటనే ఆ పోలీస్‌ను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన చైనాలోని అక్సు ప్రిఫెక్షర్‌లో చోటు చేసుకున్నది. తన భర్తతో గొడవ జరగడంతో క్షణికావేశంలో ఆ మహిళ బిల్డింగ్ మీది నుంచి అకస్మాత్తుగా దూకేసింది. అదే సమయంలో అక్కడే ఉన్న పోలీసులు మ‌హిళ‌ బిల్డింగ్ మీది నుంచి దూకుతుండగా గమనించారు. ఓ పోలీస్ వెంటనే దూకుతున్న మహిళను తన రెండు చేతులతో పట్టుకున్నాడు. ఇక.. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో నెటిజన్లు పోలీస్‌ను సూపర్‌హీరోగా కీర్తిస్తూ కామెంట్లు చేస్తున్నారు.