ఆధార్ లింక్ తో పట్టుబడ్డాడు..!

Thursday, March 1st, 2018, 04:05:57 PM IST

ఆధార్ తో సామాన్య మనుషులే కాదు నేరస్తులు కుడా దొరికిపోతారండోయ్.. ఎలా అనుకుంటున్నారా..? భార్యను హత్య చేసి జీవిత ఖైదుగా కటకటాల వెనుక శిక్షను అనుభవిస్తున్న ఓ కిరాతకుడు జైలు నుంచి తప్పించుకున్నాడు. ఆరేళ్ళపాటు పోలీసుల కన్నుగప్పి అష్ట కష్టాలు పడుతూ బయట తిరిగేస్తున్నాడు. కాని ఆధార్ అతన్ని పట్టించేసింది. అలా ఎలా జరుగుతుంది అని ఆశ్చర్య పోతున్నారా… అతను తన ఫోన్ నెంబర్ను ఆధార కు లింక్ చేసుకోవడంతో పోలీసులకు తెలిసిపోయింది. ఆ ఆధార ఆధారంతో అతగాడు ఎక్కడ ఉన్నాడో పోలీసులు కనిపెట్టేసి పట్టుకున్నారు.

సతీష్ మహిపాల్ వాల్మీకి అను ముచ్చటగా మూడు పేర్లు పెట్టుకున్న ఈ వ్యక్తి 2010లో తన భార్యను అత్యంత కిరాతకంగా హతమార్చాడు. తదనంతరం ఆమెను ముక్కలు ముక్కలుగా నరికేసాడు. ఈ కేసు విషయమై అతనికి న్యాయ స్థానం జీవిత ఖైదు విధించింది. నాసిక్ రోడ్ లో గల సెంట్రల్ జైలు నుంచి ఇతగాడు 2012లో తప్పించుకొని పారిపోయాడు . అప్పటినుంచి పోలీసులు తీవ్రంగా గాలించారు. అతడి ఫోటోలను అన్ని చోట్ల అతికించి పట్టించైనా వారికి బహుమానం కూడా ప్రకటించారు. కాని వాల్మీకి మాత్రం పోలిసుల చేతికి చిక్కలేదు. కొద్ది రోజుల క్రితం వాల్మీకి ఆధార్ ను ఫోన్ నంబర్ కు అనుసంధానం చేస్కున్నాడు. ఇంతటితో సంబందిత అధికారులకి ఈ విషయం తెలిసింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఆ ఫోన్ నెంబర్ ఆధారంగా అతడు ఉన్న ప్రదేశాన్ని ట్రాక్ చేయాగా ఉత్తరప్రదేశ్ లోమి బారానా ప్రాంతంలో నివాసం ఉన్నట్టుగా తెలుసుకొని పట్టుకున్నారు. మొబైల్ నంబర్ ను ఆధార కి లింక్ చేయడం ద్వారా వాల్మీకిని పట్టుకోగాలిగామని, పోలీసులు తెలిపారు. మళ్ళీ అతడిని సెంట్రల్ జైలుకు తరలించి శిక్ష అమలు చేసారు.