అమిత్ షా కు క్లీన్ చిట్..!

Tuesday, December 30th, 2014, 06:10:22 PM IST


షహాబుద్దీన్ ఫేక్ ఎన్ కౌంటర్ కేసులో భారతీయ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం క్లీన్ చిట్ ఇచ్చింది. ముంబైలోని సీబిఐ కోర్ట్ ఫేక్ ఎన్ కౌంటర్ పై సుదీర్ఘంగా విచారణ చేపట్టింది. అయితే, ఫేక్ ఎన్ కౌంటర్ కు సంబంధించి ఎటువంటి ఆధారాలు లభించలేదని… సీబీఐ న్యాయస్థానానికి పేర్కొన్నది.

అమిత్ షా గుజరాత్ హొమ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు, షహాబుద్దీన్ ఎన్ కౌంటర్ జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటన జరిగిన ఐదు సంవత్సరాల అనంతరం అంటే, 2010లో సీబీఐ దర్యాప్తు చేపట్టింది.