రెవంత్ రెడ్డి ఓట‌మికి వెనుక‌.. చంద్ర‌బాబు హ‌స్థం.. వాట్ ఏ సెన్షేష‌న్..?

Tuesday, December 11th, 2018, 05:59:06 PM IST

తెలంగాణ ఎన్నిక‌ల ఫ‌లితాలు ప్ర‌జాకూట‌మి ఊహించ‌ని షాక్ ఇచ్చాయి. రాజ‌కీయ‌వ‌ర్గాల‌ను సైతం ఆశ్చ‌ర్య ప‌రుస్తూ టీఆర్ఎస్ టాప్ గేర్‌లో దూసుకుపోయింది. ఈ ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ గెలుపు అంత ఈజీ కాద‌ని స‌ర్వ‌త్రా భావించారు. అయితే మ‌హాకూట‌మిలో భాగంగా టీడీపీ- కాంగ్రెస్ పొత్తు అక్క‌డి రాజ‌కీయ‌స‌మీక‌ర‌ణాల్లో మార్పులు వ‌చ్చాయి. ముఖ్యంగా ఎప్పుడైతే ప్ర‌చారంలో భాగంగా చంద్ర‌బాబు తెలంగాణ‌లో ఎంట్రీ ఇచ్చారో.. అప్పుడే అస‌లు క‌థ మొద‌లైంది.

కేసీఆర్‌తో స‌హా టీఆర్ఎస్ నేత‌ల పై చంద్ర‌బాబు చేసిన వ్యాఖ్య‌లు, ఆయ‌న తెలంగాణ పై చేసిన కుట్ర‌లు, తెలంగాణ ప్ర‌జ‌ల్లో చొచ్చుకుపోయేలా టీఆర్ఎస్ నేత‌లు విడ‌మ‌ర్చి చెప్పారు. దీంతో చంద్ర‌బాబు పై వ‌చ్చిన నెగిటీవ్ ప్ర‌భావం తాజాగా ఎన్నిక‌ల ఫ‌లితాల్లో క‌నిపిస్తోంది. దీంతో చంద్రబాబు ప్రచారానికి రావడం వల్లే కూటమి ఓటమి పాలైందన్న వాదనలూ వినిపిస్తున్నాయి. దీనిపై సోషల్ మీడియాలో విమర్శలు, జోకులు పేలుతున్నాయి. యాంటీ టీడీపీ బ్యాచ్ మొత్తం చంద్రబాబు కేంద్రంగా వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ సెన్షేష‌న్ కామెంట్స్ చేస్తున్నారు.

ఇక వాటిలో చంద్ర‌బాబు- రేవంత్ రెడ్డికి సంబందించి ఒక పోస్టు సోష‌ల్ మీగియాలో సంచ‌ల‌నం రేపుతుంది. ఆ మ్యాట‌ర్‌లోకి వెళితే.. కారు స్పీడు దెబ్బ‌కి కాంగ్రెస్‌లోని గెలుపు ప‌క్కా అనుకున్న‌ ముఖ్య‌నేత‌లు కూడా చ‌తికిల ప‌డ్డారు. వారిలో ముందు వ‌రుస‌లో ఉన్న కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి. కొడంగ‌ల్‌ను కంచుకోట‌గా భావించిన రేవంత్ త‌న‌కు తిరుగేలేద‌ని ఊహించారు. తీరా ఎన్నిక‌ల ఫ‌లితాల్లో మాత్రం సీన్ రివ‌ర్స్ అయ్యింది. దీంతో ఎవ‌రూ ఊహించ‌ని విధంగా రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ అభ్య‌ర్ధి ప‌ట్నం న‌రేంద‌ర్ రెడ్డి చేతిలో ఓట‌మిపాలు అయ్యారు.

దీంతో రేవంత్ రెడ్డి ఓట‌మికి ముఖ్య కార‌ణం చంద్ర‌బాబే అని సోష‌ల్ మీడియాలో నెటిజ‌న్లు తేల్చేస్తున్నారు. డిసెంబరు 2న ప్ర‌చారంలో భాగంగా చంద్రబాబు వ్యాఖ్యానిస్తూ.. పార్టీ మారిన వారందరినీ చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చాడు. దీంతో చంద్ర‌బాబు మాట‌లు సీరియ‌స్‌గా తీసుకున్న తెలంగాణలోని కొడంగ‌ల్ ప్ర‌జ‌లు రేవంత్ రెడ్డిని చిత్తుగా ఓడించారని.. రేవంత్ ఓట‌మి వెనుక చంద్ర‌బాబు హ‌స్తం ఉంద‌ని.. దీంతో కొడంగ‌ల్‌లో రెండుసార్లు గెలిచి హ్యాట్రిక్ కొట్టాల‌ని భావించిన రేవంత్ చంద్ర‌బాబు ఇచ్చిన పిలుపుతో ఓట‌మి పాల‌య్య‌డ‌ని సోష‌ల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు నెటిజ‌న్లు. మ‌రి ఓడితే రాజ‌కీయ‌స‌న్యాశం తీసుకుంటాన‌ని సవాల్ విసిరిన రేవంత్ రెడ్డి ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారో చూడాలి.