సర్జికల్ స్ట్రైక్స్-2 : స‌లాం చేస్తున్న సినీ తార‌లు..!

Tuesday, February 26th, 2019, 01:14:26 PM IST

పుల్వామాలో సైనిక బలగాలపై దాడికి పాల్పడ్డ జైషే మహ్మద్ శిబిరాలపై భార‌త‌ వైమానిక ద‌ళాలు దాడులు చేసి ప్రతీకారం తీర్చుకున్నాయి.

12 మిరాజ్‌-2000 యుద్ద విమానాలతో దాడులు చేసిన ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ పాక్‌ ఉగ్ర సంస్థలకు చెందిన కంట్రోల్‌ రూమ్‌లను వెయ్యి కేజీల బాంబులతో ధ్వంసం చేశాయి.

ఈ రోజు ఉదయం భారత వాయు సేన 29 నిమిషాల పాటు పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలపై బాంబుల వర్షం కురిపించింది ఇక ఈ దాడుల్లో దాదాపు 300 మంది ఉగ్రవాదులు హతమైనట్టు తెలుస్తోంది.

ఈ నేప‌ధ్యంలో తాజా ఇండియన్ ఆర్మీ చ‌ర్య పై దేశ‌మంతా హ‌ర్షం వ్య‌క్తం చేస్తుంది. దీంతో భార‌త సైన్యాన్ని ప్రశంసిస్తూ తాజాగా సినీ తార‌లు సోష‌ల్ మీడియాలో స్పందిస్తున్నారు.

ఈ క్ర‌మంలో టాలీవుడ్ ద‌ర్శ‌క, న‌టులు.. రాజమౌళి, ఎన్టీఆర్‌, మహేష్‌ బాబు, కమల్‌ హాసన్‌, రామ్‌ చరణ్‌, అఖిల్, వరుణ్ తేజ్‌, మంచు విష్ణు, మెహరీన్‌, సోనాక్షి సిన్హా, నితిన్‌, ఉపాసనల‌తో పాటు పలువురు సినీ ప్ర‌ముఖులు ట్వీట్లు చేస్తున్నారు.