పవన్ చెప్పినంత పని చేస్తే.. బాబు షాక్ తినడం ఖాయం..!

Sunday, May 29th, 2016, 09:51:12 AM IST


జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ త్వరలోనే సినిమాలకు స్వస్తి పలికి రాజకీయాలలోకి రాబోతున్నారు. రాజకీయాల్లో తనదైన శైలిలో దూసుకుపోవడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. అయితే, గతంలో పవన్ ఈ సెప్టెంబర్ లో రాష్ట్రంలో బస్సు యాత్ర చేపట్టబోతున్నారని వార్తలు వచ్చాయి. అయితే, పవన్ దీనిపై ఇంతవరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు.

ఇక ఇదిలా ఉంటే, పవన్ కళ్యాణ్ ఎన్నికలకు ముందు ఎలా ప్రచారం చేస్తారు.. ఎలాంటి హామీలు ఇస్తున్నారు.. పార్టీలో ఎవరెవరు ఉండబోతున్నారు. ఇతర పార్టీలలో నుంచి నాయకులను ఆహ్వానిస్తారా లేక, కొత్త వారిని పార్టీలోకి తీసుకుంటారా అన్నవి ఇప్పటి వరకు స్పష్టత లేని విషయాలు.

అయితే, పవన్ కళ్యాణ్ కనుక ఇచ్చిన హామీలను ఇచ్చినట్టుగా నిలుపుకోగలిగితే ప్రజలు పవన్ ను దేవుడికన్నా మిన్నగా గుండెల్లో పెట్టుకొని పూజిస్తారు. ఇలా జరిగితే అటు తెలుగుదేశం పార్టీ, వైకాపా రెండు కూడా ఇబ్బందుల్లో పడతాయి అనడంలో సందేహం లేదు. చూద్దాం ఎలా జరుగుతుందో.