గుంటూరు పరిధిలోనే రాజధాని

Thursday, October 9th, 2014, 08:25:08 AM IST

chandra-babu
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం వినుకొండ నియోజకవర్గం పరిధిలోని సవల్యపురంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని నగరాన్ని గుంటూరు జిల్లా పరిసరాలలోనే నిర్మిస్తామని ప్రకటించారు. అయితే తొలుత విజయవాడ పరిసరాలలో ఏపీ రాజధానిని నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పటికీ, ఆ ప్రాంతంలో ఎక్కడ నిర్మిస్తారన్న విషయాన్ని పేర్కొనలేదు.

ఇక ఈ విషయంపై స్పష్టతనిస్తూ చంద్రబాబు సవల్యపురం పర్యటన సందర్భంగా గుంటూరు పరిసరాలలోనే కొత్త రాజధాని ఉండబోతోందని ప్రకటించారు. అలాగే రాజధాని నిర్మాణంలో ఇంటింటి నుంచి ఒక ఇటుకను సేకరిస్తామని చంద్రబాబు పేర్కొన్నారు. కాగా గుంటూరు పరిసరాలలో రాజధాని అని బాబు ప్రకటించడంతో ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి కేంద్రంగా ఏర్పాటు కాబోతోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.