యోగా క్లాసులో చంద్రబాబు డాన్సు!

Saturday, January 31st, 2015, 09:18:25 AM IST


తమిళనాడుకు చెందిన ఈషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రముఖ ఆధ్యాత్మిక గురువు జగ్గీ వాసుదేవ్ ఇన్నర్ ఇంజినీరింగ్ ఫర్ జాయ్ ఫుల్ లివింగ్ పై శిక్షణా తరగతులను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ యోగా తరగతులను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో సహా పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు హాజరవుతున్నారు. కాగా మూడు రోజుల పాటు నిర్వహించే ఈ తరగతుల్లో శిక్షణలో భాగంగా ఆలపించే పాటలకు శుక్రవారం సీఎంతో సహా పలువురు నృత్యాలు చేశారు.

ఇక రెండవ రోజు తరగతుల్లో ఆసనాలు, క్రియాసంద్ ముద్రలతో పాటు నృత్యాలు కూడా చేశారు. ఈ నేపధ్యంగా చంద్రబాబు సుమారు 5 నుండి 10 నిమిషాల పాటు డాన్సు చేశారు. కాగా ఉదయం 8గంటల నుండి సాయంత్రం 6గంటల వరకు సాగిన ఈ శిక్షణలో మంత్రులు, అధికారులతో కలిపి మొత్తం 300మంది పాల్గొన్నారు.