వాళ్ళిద్దరూ కలిస్తే.. బాబుకు కొత్త చిక్కులే..!

Sunday, May 22nd, 2016, 12:15:51 PM IST


పాపం బాబుకు కంటిమీద కునుకు ఉండటంలేదు. రోజు ఏదో ఒక సమస్య వచ్చిపడుతూనే ఉన్నది. నోటుకు ఓటు కేసునుంచి ఎలాగోలా బయటపడితే.. తరువాత తెలంగాణాలో వలసలు మొదలయ్యాయి. పోనీలే అక్కడ అధికారంలో లేముకదా ఇక్కడ ఆపరేషన్ ఆకర్ష్ ను ప్రయోగించి నాయకులను తమవైపు తిప్పుకోవచ్చులే అనుకున్నారు. అనుకున్నట్టుగానే తిప్పుకున్నారు. ఇలా చేయడం తనకు సుతానా ఇష్టం లేదని జనసేన అధ్యక్షుడు కుండబద్దలు కొట్టడమే కాకుండా.. తెలంగాణ కెసిఆర్ పాలన బాగుంది అని మెచ్చుకోవడంతో బాబుకు కోపం వచ్చింది. బాబుకు కోపం తెప్పించడం ఎందుకులే అనుకున్న పవన్.. మిత్రపక్షం నుంచి బయటకు వచ్చారు. తరువాత రాష్ట్రంలో నీళ్ళ సమస్య.. ఈ సమస్యను వరుణుడు తీర్చాడు. తరువాత ప్రాజెక్టుల సమస్య.. ప్రత్యేక హోదా సమస్య .. కేంద్రం ఇవ్వను అంటుంది. ఇవ్వాలని ప్రతిపక్షం పట్టుబడుతుంది. అధికారపక్షం మాత్రం ఎటు మాట్లాడలేక పోతున్నది.

చెప్పడం మరిచా.. మధ్యలో ఇంకో సమస్య కూడా వచ్చింది. అది కాపు రిజర్వేషన్ సమస్య. కాపుల రిజర్వేషన్ విషయంలో తెలుగుదేశం అధికారంలోకి రాకముందు హామీ ఇచ్చారని, కాని, తరువాత హామీని తుంగలో తొక్కేశారని చెప్పి బీసీ సంఘాల అధ్యక్షుడు ముద్రగడ పద్మనాభం ఉద్యమం బాట పట్టిన సంగతి తెలిసిందే. కాగా, ఇప్పుడు బీసీ సంఘాలు, దళిత సంఘాలు ఒక్కటిగా మరాబోతున్నాయి. ఇద్దరు కలిసి ఉమ్మడిగా పోరాటం చేసి, తమ డిమాండ్లు నెరవేర్చుకోవాలని చూస్తున్నాయి. బీసీలు, దళితులు కలిసి పోరాటం చేశారంటే బాబుకు కొత్త సమస్యలు వచ్చిపడినట్టే అవుతుంది. మరి ఈ సమస్య నుంచి బాబు ఎలా బయటపడటారో చూడాలి.