‘ఉత్తమ ముఖ్యమంత్రి’ చంద్రబాబు నాయుడు

Sunday, January 31st, 2016, 12:38:54 PM IST


పూణేకు చెందిన, ఎమ్ఐటీ స్కూల్ ఆఫ్ గవర్నెన్స్ తో భాగస్వామ్యం కలిగిన భారతీయ చత్ర సన్ సద్ అనే సంస్థ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉత్తమ ముఖ్యమంత్రి అవార్డును ప్రధానం చేసింది. ఈ సందర్బంగా సన్ సద్ ప్రతినిధులు మాట్లాడుతూ ‘ ఉత్తమ పాలన కనబరిచినందుకు గాను ఆయనకు ఈ అవార్డును బహుకరిస్తున్నట్లు తెలిపారు. ఆంద్రప్రదేశ్ విడిపోయి కొత్త రాష్ట్రం ఏర్పడ్డాక చంద్రబాబు నాయుడుగారు పాలనా భాద్యతలు చేపట్టి సమర్థవంతంగా పాలన కొనసాగిస్తున్నారు.

ఆయన ఉత్తమమైన పాలన దేశంలోని అందరి ముఖ్యమంత్రుల కంటే ఆయన్ను గొప్పవాడిగా నిలబెట్టింది. దేశ యువతకు ఆయనో స్పూర్తి. ఆయన రాజకీయ జీవితం, ఆయన చేసిన త్యాగాలు దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు ఎంతగానో ఉపయోగపడ్డాయి’ అన్నారు. ఈ సందర్బంగా బాబు మాట్లాడుతూ ‘ ఈ అవార్డు అందుకోవటం చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడైనా సరే యువత గొప్పగా ఆలోచించాలి. హద్దులు దాటి ఆలోచించాలి. అప్పుడే అద్బుతాలు సృష్టిస్తారు’ అన్నారు.