తెలుగు ముఖ్యమంత్రులకు ముచ్చెమటలు పట్టిస్తున్న ఇద్దరు మొనగాళ్ళు

Friday, June 10th, 2016, 03:55:14 AM IST


ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల పరిస్థితి ముందు నుయ్యి, వెనుక గొయ్యి అన్న చందంగా ఉంది. రెండు రాష్ట్రాల్లో ఉన్న ఇద్దరు నాయకులు అటు చంద్రబాబును, ఇటు కేసీఆర్ ను తెగ ఇబ్బంది పెడుతున్నారు. ఏపీలో అయితే ముద్రగడ పద్మనాభం కాపు రిజర్వేషన్ల పేరిట అతి పెద్ద సామాజిక వర్గంలో ప్రకంపనలు రేపి చంద్రబాబుపైకి యుద్దానికి దిగాడు. ఇప్పటికే రెండుసార్లు దీక్ష చేసి బాబుకు ముచ్చెమటలు పట్టించాడు. దీంతో బాబు పరిస్థితి అయోమయంలో పడిపోయింది. ఆయనపై ఏమైనా చర్యలు తీసుకుందామంటే అదో పెద్ద రాభసైపోయి మొదటికే మోసమొస్తుంది. అలాగని చూస్తూ కూర్చుంటే కూర్చున్న కుర్చీ కాస్త కూలిపోతుంది.

అలాగే తెలంగాణాలో తిరుగులేని సిఎం అనిపించుకున్న కేసీఆర్ కు నిన్నమొన్నటి స్నేహితుడు, ఉద్యమంలో కీలక సలహాలు సూచనలు ఇచ్చి రాష్ట్ర సాకారంలో ముఖ్య పాత్ర పోషించిన కోదండరాం ఇప్పుడు ఆయనకే ఎదురు తిరిగి కంగారు పుట్టిస్తున్నాడు. తన రాజకీయ్ చతురతతో ప్రతిపక్షమనే గొడవ లేకుండా చేసిన కేసీఆర్ కోదండరాం దెబ్బకు కామ్ గా కూర్చోక తప్పలేదు. ఎదురుతిరిగిన ఎవరినైనా యిట్టె అణచివేసే కేసీఆర్ కోదండరామ్ విషయంలో అలాగే దూకుడుగా ప్రవర్తిస్తే ఉద్యమ నాయకుదన్న పేరును కాస్త పోగోట్టుకోక తప్పదు. అలాగని వదిలేస్తే సమస్య కాస్త రాకాసి పుండై ప్రభుత్వాన్నే తోలచక మానదు. ఇలా ఇద్దరు ముఖ్యమంత్రులకు ఇద్దరు వ్యక్తులు పెను సవాళ్ళగా మారారు.