అందరూ చంద్రబాబుకు వార్నింగ్ ఇస్తుంటే బాలకృష్ణ ఏం చేస్తున్నట్టు..!

Tuesday, June 14th, 2016, 12:53:04 PM IST


ముద్రగడ కాపు దీక్ష నేపథ్యంలో కాపు పెద్దలు, ప్రతిపక్షం వైసీపీ అందరూ కలిసి చంద్రబాబును కారనర్ చేసి విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఎన్నికల సమయంలో కాపులకిచ్చిన మాటను బాబు ప్రభుత్వం నిలబెట్టుకోలేకపోతోందని అందుకే వచ్చే ఎన్నికల్లో గద్దె దింపుతామని హెచ్చరిస్తున్నారు కూడా. పైగా చంద్రబాబు కావాలనే కాపులను నిర్లక్ష్యం చేస్తున్నారని కూడా ఆరోపిస్తున్నారు. ఇలా రోజు రోజుకూ ముద్రగడకు మద్దత్తుదారులు ఎక్కువవుతున్నారు. ఇంకొన్ని రోజులు ఇలాగే సాగితే టీడీపీలోనే చీలికలు వచ్చే ప్రమాదముంది

అసలే కొత్త రాజధాని, హోదా, పెట్టుబడుల ఆహ్వానం వంటి అంశాలతో తలమునకలై ఉన్న క్లిష్ట పరిస్థితుల్లో కాపు నేతలు ఉద్యమమ చేయడంతో చంద్రబాబు పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. దీంతో ఆయన ఏ పనీ సంపూర్ణంగా చేయలేకపోతున్నారు. ఈ పరిస్థితుల్లో ఆయనకు ఓ బలమైన సపోర్ట్ కావాలి. అదీ ఓ ప్రజాకర్షణ కలిగిన నేత నుండి రావాలి. ప్రస్తుతం పార్టీలో ఆ రేంజులో ఆకర్షణ ఉన్న నేత ఒక్క బాలకృష్ణ మాత్రమే. నందమూరి వంశానికున్న అశేష అభిమాన గణం బాలయ్య మాట వింటే బాబుకు రక్షణ, మద్దత్తు దొరికినట్టే. కాబట్టి ఇక్కడ రావాల్సింది, చేయవలసింది బాలయ్య ఒక్కడే.