ఎమ్మెల్యేలకు చంద్రబాబు స్పెషల్ క్లాసులట

Friday, June 14th, 2019, 08:41:48 AM IST


చంద్రబాబుగారికి ముఖ్యమంత్రిగా ఎంత అనుభవం ఉందో ప్రతిపక్ష నాయకుడిగా కూడా అంతే అనుభవం ఉంది. ఏ పొజిషన్లో ఉన్నా ప్రత్యర్థులను సమర్థంగానే ఎదుర్కొన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి లాంటి వారికే మాటకు మాట సమాధానం ఇచ్చిన ట్రాక్ రికార్డ్ చంద్రబాబుది కానీ అంతటి అనుభవం నిన్నటి అసెంబ్లీ సమావేశాల్లో వెలవెలబోయింది. కొత్త సీఎం జగన్ తన ఎమ్మెల్యేలతో చంద్రబాబుపై విరుచుకుపడిపోయారు. రోజా, చెవిరెడ్డి, అంబటి రాంబాబు లాంటి వారంతా చురకలు వేస్తూ ప్రసంగాలు చేశారు. ఒకానొక దశలో చంద్రబాబే డిఫెండ్ చేసుకోలేని పరిస్థితి కనబడింది.

ఇక టీడీపీ ఎమ్మెల్యేల సిట్యుయేషన్ మరీ దారుణం. జగన్ వైకాపా చేరడానికి టీడీపీ ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారని అంటున్నా కౌంటర్ వేయలేకపోయారు. నిన్నటి పరిస్థితితో ఆలోచనలో పడిన బాబు ఇలాగే ఉంటే సభలో ప్రతిసారీ పరాభవం తప్పదని అనుకుని వైకాపాను ధీటుగా ఎదుర్కొనేలా టీమ్ సిద్ధంకావాలని కోరుతున్నారట. అందుకుగాను ఎమ్మెల్యేలకు ప్రత్యేకంగా దిశానిర్దేశం చేయనున్నారట. అందులో భాగంగానే ఈరోజు టీడీపీ రాష్ట్రస్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో గెలిచిన, ఓడిన అందరు నేతలు పాల్గొననున్నారు.