బాబు ఎత్తులకు జగన్ చిత్తు .. మరి పవన్ సంగతేంది..?

Friday, April 29th, 2016, 08:30:14 AM IST


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి రాయకీయ రంగంలో 30 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్నది. ఎటువంటి వారినైనా తన ఎత్తులతో చిత్తుచేయగల సమర్ధుడు. రాజకీయాలలో అపరచాణిక్యుడిగా పేరుతెచ్చుకున్నాడు చంద్రబాబు పార్టీ గడ్డుపరిస్థితులలో ఉన్నప్పుడు ఎలా వ్యవహరించాలో.. పార్టీని ముందుకు ఎలా నడిపించాలో బాబుకు బాగా తెలుసు.

అంతెందుకు.. ఎవరి అవసరం ఎంతవరకు ఉన్నదో అంతవరకూ వారిని ఉపయోగించుకోవడం బాబుకు తెలిసినంతగా మరెవ్వరికీ తెలియదు అనడంలో సందేహం లేదు. బాబు సమర్ధుడు కాబట్టే ఇంకా రాయకీయాలలో చక్రం తిప్పగలుగుతున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు దేశంలోనే కఠినమైన రాజకీయాలు. ఇక్కడ నెగ్గుకు రాగలిగితే.. దేశంలో ఎక్కడైనా రాణించవచ్చు. చంద్రబాబు ఎత్తులకు జగన్ సైతం చిత్తైపోతున్నారు.

ఇక ఇదిలా ఉంటే, 2019 ఎన్నికల నాటికి పవన్ కళ్యాణ్ ప్రత్యక్షంగా బరిలోకి దిగబోతున్నారు. 2014 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి మిత్రపక్షంగా ఉంటే, 2019లో తెలుగుదేశం పార్టీపై పోటీకి దిగబోతున్నారు. సుదీర్ఘమైన అనుభవం ఉన్న చంద్రబాబును పవన్ కళ్యాణ్, ఆయన పార్టీ జనసేన ఎంతమేర ఎదుర్కోగాలుగుతుంది అన్నది మిలియన్ డాలర్ ప్రశ్న.