ఆపద నుండి గట్టేందుకు బాబు మాస్టర్ ప్లాన్ రెడీ చేశారా..?

Wednesday, June 15th, 2016, 08:50:05 AM IST


ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వానికి ప్రస్తుతం గడ్డుకాలమే నడుస్తోంది. మొదట చిన్న సమస్యగా భావించిన కాపు ఉద్యమం ఇప్పుడు బాబు కుర్చీకి త్రాచు పాములా చుట్టుకుని కుదురుగా ఉండనివ్వడం లేదు. బాబు మత్రమే కాదు ఎవరూ కూడా కాపు ఉద్యమం ఇంత తీవ్ర రూపం దాల్చుతుందని ఊహించలేదు. ప్రస్తుతం కాపు నాయకుడు ముద్రగడ రాజమహేంద్రవరం ఆసుపత్రిలో దీక్ష కొనసాగిస్తున్నారు. దీక్ష ఆరో రోజుకు చేరడంతో ఆయన ఆరోగ్యం బాగా క్షీణించింది. దీంతో ఏ సమయానైనా పరిస్థితి చెయ్యిదాటి పోవచ్చని భావించిన బాబు ఓ మాస్టర్ ప్లాన్ రెడీ చేసాడట.

ఉద్యమకారులపై కేసులను ఎత్తివేయాలన్న ముద్రగడ డిమాండును పూర్తిగా కాకపోయినా కొంతమేరకు నెరవేర్చడమే ప్లాన్. కేసులు ఎత్తివేయడం కుదరదని..కావాలంటే పునర్విచారణ చేపడతామని ఆయన ముద్రగడను బుజ్జగించాల్సిందిగా నిర్ణయం తీసుకున్న బాబు మధ్యవర్తిగా తూర్పు గోదావరి కలెక్టరును ఆసుపత్రికి పంపాలని అనుకుంటున్నారట. ఒకవేళ ఈ ప్లాన్ వర్కవుటైతే మంచిది లేకపోతే చర్చలు విఫలం అన్న కారణంతో పరిస్థితి మరింత వేడెక్కే ప్రమాదముంది.