జపానోళ్ళకు అమరావతి రెండో ఇళ్ళు అవుతందట..!

Tuesday, May 24th, 2016, 11:20:47 AM IST


అమరావతి నిర్మాణం కోసం ఏపీ మఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఇన్నాళ్ళు అమరావతి నిర్మాణంలో జపాన్ దేశాన్ని భాగస్వామిని చేసి సుదీర్ఘ ప్రయోజనాల పొందాలని బాబు ఆలోచిస్తున్నారు. అందుకే అమరావతి ఆర్కిటెక్ట్ అయిన జపాన్ కంపెనీ ‘మాకి అసోసియేట్స్’ ను అమరావతిని తమ సొంత ప్రాంతమనుకుని అభివృద్ధి చేయాలని, అమరావతి జపానోళ్ళకు రెండవ ఇల్లు కావాలని అన్నారు.

రెండురోజుల పర్యటనలో భాగంగా నిన్న సోమవారం విజయవాడకు వచ్చిన జపాన్ ఆర్ధిక, వాణిజ్య, పరిశ్రమల శాఖా మంత్రి యోసుకే తకాగి, ఆయన 80 మంది పారిశ్రామికవేత్తల బృందంతో ఏపీ ఎకనమికల్ డెవలప్మెంట్ బోర్డ్, ఇంధన, పరిశ్రమల మౌలిక సదుపాయాల బోర్డ్ సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో బాబు మాట్లాడుతూ అమరావతితో పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాలను అభివృద్ధి చేయాలని బాబు పిలుపునిచ్చారు. టెక్నాలజీ, ఆర్ధిక వనరులలో జపాన్ బలంగా ఉంటే, మానవ వనరులలో భారత్ పటిష్టంగా ఉందని రెండూ కలిసి అమరావతిని అభివృద్ధి చేయలాని అన్నారు. ఇంకో సంవత్సరంలో మరో 150 జపాన్ కంపెనీలు ఏపీకి రావాలని అన్నారు.