చంద్రబాబు వర్సెస్ సచివాలయం ఉద్యోగులు కేరాఫ్ వెలగపూడి

Monday, June 6th, 2016, 11:30:58 AM IST


ఆంధ్రప్రదేశ్ సచివాలయం ఉద్యోగుల కోసం ప్రభుత్వం హుటాహుటిన రాజధాని అమరావతిలోని వెలగపూడి వద్ద కొత్తగా సచివాలయాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. జూన్ 27 వరకు హైదరాబాద్ లో ఉన్న సచివాలయం ఉద్యోగులు ఆంధ్రప్రదేశ్ కు రావాలని, వారు అక్కడే ఉంటె పాలనాపరమైన సమస్యలు తలెత్తుతున్నాయని బాబు అంటున్నారు. తాత్కాలిక వసతి సదుపాయం కల్పిస్తామని బాబు చెప్తున్నారు. అయితే, ఇందుకు సచివాలయం ఉద్యోగులు అంగీకరించడంలేదు. అన్ని వసతులు కలిస్తేనే ఆంధ్రప్రదేశ్ కు వస్తామని లేదంటే రాలేమని ఉద్యోగులుతెగేసి చెప్తున్నారు.

ఇక, ఉద్యోగుల డిమాండ్లపై ప్రభుత్వం సీరియస్ అవుతున్నది. ప్రభుత్వం ఇలాంటి డిమాండ్లు కోరడం సరికాదని ప్రభుత్వం మండిపడుతున్నది. అమరావతికి వచ్చాక పూర్తి వసతులు కల్పిస్తామని అంటున్నారు. ఇక ప్రభుత్వ ప్రతినిధులు కూడా అమరావతి ఉద్యోగులు వస్తే ఆతిధ్యం ఇస్తామని, వారికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తామని అంటున్నారు. అసలే ఇప్పుడు ప్రభుత్వం అనేక సమస్యలతో సతమతమవుతున్న సమయంలో ఇప్పుడు సచివాలయం ఉద్యోగుల సమస్య మరింత జటిలంగా మారింది.