బెజవాడలో ఆఫీసు – తుళ్ళూరులో మకాం!

Tuesday, April 7th, 2015, 08:27:39 AM IST


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర నూతన రాజధాని నగరాన్ని విజయవాడ సమీపంలోని తుళ్ళూరులో ‘అమరావతి’ పేరుతో ఏర్పాటు చేయనున్న సంగతి తెలిసిందే. కాగా ఈ మేరకు రెండు నెలలలో తన ముఖ్యమంత్రి క్యాపు కార్యాలయాన్ని విజయవాడలో ఏర్పాటు చెయ్యడానికి చంద్రబాబు నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇక క్యాంపు కార్యాలయం ఏర్పాటు చెయ్యడం కోసం వీలయితే ప్రభుత్వ భవనాన్ని లేదా ఏదైనా ప్రైవేట్ భవనాన్ని తీసుకుని ఆఫీసు ప్రారంభించే యోచనలో చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తోంది.

అలాగే తుళ్ళూరు పరిసరాలలో సరైన వసతులు లేనందున తన క్యాంపు కార్యాలయాన్ని విజయవాడలోనే ఏర్పాటు చెయ్యాలని చంద్రబాబు అధికారులకు చెప్పినట్లు సమాచారం. అదేవిధంగా నివాసంతో పాటు అధికారులు, ప్రజా ప్రతినిధులతో సమీక్ష నిర్వహించడానికి వీలుగా వసతులు ఏర్పాటు చెయ్యాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలను జారీ చేశారు. ఇక అమరావతి ప్రాంతంలో ఇంటి నిర్మాణం కోసం చంద్రబాబు స్థలం కొనుగోలు చెయ్యాలని నిర్ణయించినట్లు సమీప వర్గాల ద్వారా సమాచారం తెలుస్తోంది.