లిఫ్ట్ పేరుతో మోసం, కన్నతల్లి ముందే….?

Wednesday, July 25th, 2018, 06:58:03 PM IST

కొన్నాళ్ల నుండి ప్రభుత్వం కానీ చట్టాలు కానీ, ఎన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నప్పటికీ కూడా మహిళలపై, బాలికలపై జరుగుతున్న అత్యాచారాలను మాత్రం అదుపుచేయలేకపోతున్నారు. మరీ ముఖ్యమా కొందరు మృగాళ్లు అయితే మనిషి సంచారం లేని ప్రదేశాలు ఎంచుకుని మరీ ఇటువంటి నీచ ఘటనలకు పాల్పడుతున్నారు. ఇక ప్రస్తుతం ఉత్తర్ ప్రదేశ్ లోని కన్నౌజ్ జిల్లాలో నిన్న సాయంత్రం కొందరు యువకులు ఒక యువతిపై అత్యాచారానికి ఒడిగట్టారు. పూర్తి వివరాల్లోకి వెళితే, కొన్నాళ్ల క్రితం ఒక అత్యాచార కేసు విషయమై జైల్లో వున్న తన సోదరుణ్ణి చూసేందుకు కన్నౌజ్ జైలుకు ఒక 15 ఏళ్ళ యువతీ మరియు ఆమె తల్లి వెళ్లి వస్తన్నారు.

అయితే ఆ ప్రాంతం ఊరు చివర కావడంతో ఎటువంటి వాహనాలు లేక వారిద్దరూ కాలినడకన ఇంటికి బయలుదేరారు. ఆ సమయంలో అటువైపుగా కారులో వస్తున్న కొందరు యువకులు, వారిని ఆపి మీకు లిఫ్ట్ ఇస్తామంటూ ఎక్కుంచుకున్నారు. కాసేపటికి హఠాత్తుగా యువతిని పట్టుకుని ఘోరాతి ఘోరంగా ఆమె తల్లి ఎదుటనే అత్యాచారానికి పాల్పడ్డారు. కాగా ఘటన అనంతరం ఇద్దరినీ కారునుండి బయటకు తోసేసి వెళ్లిపోయారు. రాత్రిపూట అటుగా వెళ్తున్న కొందరు పాదచారులు వారి పరిస్థితిని చూసి ఇద్దరినీ స్థానిక ఆసుపత్రిలో చేర్పించారు. అయితే పలు వైద్యపరీక్షల అనంతరం యువతిపై అత్యాచారం జరిగిందని నిర్ధారించిన పోలీసులు, యువతీ తల్లి ఫిర్యాదుమేరకు నిందితులను అతిత్వరలోనే పట్టుకుంటామని స్థానిక ఎస్ఐ చెపుతున్నారు…..