వైద్యం పేరుతో మహిళపై వికృత చేష్టలు

Saturday, April 28th, 2018, 04:06:34 PM IST

మహిళల చట్టంలో ఎన్ని మార్పులు వస్తున్నా ఇంకా వారికీ వేధింపుల బాధ తప్పడం లేదు. ప్రతి రంగంలో ఎదో ఒక విధంగా మహిళలు వేధింపులకు గురవుతున్నారు. అయితే కొందరు మహిళలు దైర్యంగా బయటకు వచ్చి నిందితులను పోలీసులకు పట్టిస్తున్నారు. అందుకు సంబందించిన ఆధారాలు కూడా బయపడుతుండడంతో పోలీసులు వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. రీసెంట్ గా చెన్నై లోని ఒక డాక్టర్ వికృత చేష్టలు కూడా ఆధారాలతో బయపడటంలో అతనిపై కఠిన చర్యలు తీసుకున్నారు.

అసలు వివరాల్లోకి వెళితే.. ఎంతో గౌరవమైన డాక్టర్ వృత్తిలో ఉండి ఆరోగ్యం బాగాలేదని వచ్చిన మహిళలపై అతని ప్రవర్తన అందరిని షాక్ కి గురి చేసింది. అంతే కాకుండా మహిళల ఫొటోలు తీసి ఇబ్బందికి గురి చేశాడు. శివగురునాథన్‌ (64) అనే సీనియర్ డాక్టర్ స్థానిక మైలాపూర్‌లో గత కొన్నేళ్లుగా వైద్యం అందిస్తున్నాడు. అయితే అతని దగ్గరికి ఇటీవల ఒక మహిళ ఆరోగ్యం బాగోలేదని వెళ్లింది. చిక్కిత్స పేరుతో వైద్యుడు ఆమెను ఇష్టం వచ్చినట్లు తాకి ఇబ్బందికి గురి చేశాడు. అంతే కాకుండా ఫొటోలు కూడా తీయడంతో ఆగ్రహించిన మహిళ పోలీసులను ఆశ్రయించింది. సమాచారం అందుకున్న పోలీసులు వైద్యుడి సెల్ ఫోన్ తీసుకొని పరీక్షించగా అందులో అసభ్యకర ఫొటోలు చాలా ఉండడం గమనించి అతన్ని అరెస్ట్ చేశారు.