హైదరాబాద్ లో నేడు 144 సెక్షన్!

Saturday, December 6th, 2014, 09:11:32 AM IST


తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాద్ లో నేడు బ్లాక్ డే సందర్భంగా 144 సెక్షన్ విధించారు. కాగా బాబ్రీ మసీదును కూల్చివేసి సరిగ్గా నేటికి 22 ఏళ్ళు కావడంతో అత్యంత సున్నితమైన హైదరాబాద్ నగరంలో హై అలర్ట్ ను ప్రకటించడంతో పాటు 144 సెక్షన్ ను విధించారు. ఇక నగరంలో నేడు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా 70 ప్లాటూన్ల బలగాలతో ఓల్డ్ సిటీని మొహరించారు. ఇక హైదరాబాద్ లో ర్యాలీలు సమావేశాలను నిషేధించారు. అలాగే ఆక్టోపస్, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్సు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్సు బలగాలను రంగంలోకి దించిన అధికారులు నగర వ్యాప్తంగా తనిఖీలను ముమ్మరం చేశారు. ఇక ఐబీ హెచ్చరికలు, బ్లాక్ డే నేపధ్యంగా హైదరాబాద్ నగరంలో శాంతిభద్రతలను కాపాడేందుకు అధికారులు భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేశారు.