నాన్నకు ప్రేమతో రిజల్ట్.. అయోమయంలో ఫ్యాన్స్..!

Wednesday, January 13th, 2016, 09:49:10 AM IST


భారీ అంచనాలతో.. మొదటి నుంచి పాజిటివ్ టాక్ తో సంక్రాంతి బరిలో నిలిచిన సినిమా నాన్నకు ప్రేమతో. ఈరోజు భారీ ఎత్తున విడుదలైంది. ఎన్టీయార్ లుక్, స్టైల్ అద్బుతంగా ఉండటంతో పాటు.. పాటలు సైతం అద్బుతంగా ఉండటంతో పాటు ట్రైలర్ కు మంచి టాక్ వచ్చింది. ఇక, మొదటి నుంచి ఈ సినిమాలో మాస్ ప్రేక్షకులు కోరుకునే భారీ యాక్షన్ సీక్వెల్స్ ఉండవని, సినిమా మొత్తం మైండ్ గేమ్ తో నడుస్తుందని సుకుమార్ టీం చెప్తున్న సంగతి తెలిసిందే.

ఎంత చెప్పినా ఎన్టీయార్ అభిమానులు కోరుకున్నది మాత్రం యాక్షన్ సీక్వెల్స్ అనే చెప్పాలి. అయితే, సుకుమార్ సినిమా అంటేనే క్లాసికల్ గా ఉంటుంది. ఎన్టీయార్ ను ఇందులో చాలా క్లాసికల్ గా చూపించారు. మైండ్ గేమింగ్ ఫ్యామిలీ డ్రామాగా సినిమా ఉంటుంది. అయితే, ఇది పక్కా మల్టీప్లేక్స్ ఆడియన్స్ కు నచ్చే సినిమా కావడంతో.. ఎన్టీయార్ ఫ్యాన్స్ అయోమయంలో పడిపోయారు. సినిమా బాగాలేదని ఎవరు అనడంలేదు. సినిమా హిట్ అంటున్నా.. అది ఎంతవరకు ఆడుతుంది అన్నది మాత్రం సందేహమే. పక్కా మాస్ ఉండే బి, సి సెంటర్స్ లో సినిమా నిలబడటం అనుమానమే అని చెప్పొచ్చు.