200 క్రెడిట్ కార్డులతో 2.39 కోట్ల టోకరా… వీళ్ళు దొంగలు కాదురోయ్

Tuesday, May 1st, 2018, 03:36:54 PM IST

దొంగ పత్రాలు జత పరచి, బ్యాంకులలో నుండి లోన్లు తీస్కోని ఎగ్గొట్టడం చూసి ఉంటాం, నకిలీ నోట్ల మార్పిడి చేసి బ్యాంకులను కొల్లగొట్టడం, ఇంకా అంటే ఏకంగా బ్యాంకులకే కన్నం పెట్టడం చూసి ఉంటాం. కానీ ఇటివల బ్యాంకులకు టోకరా వేసిన 16 మందిని హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేసి ఊసులు లేక్కపెట్టిస్తున్నారు. నకిలీ పత్రాలతో క్రెడిట్ కార్డులు పొందిన నిందితులు బ్యాంకులను భారీ స్థాయిలో మోసం చేశారు.ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 4 ముఠాలకు చెందిన 16 మందిని అరెస్ట్ చేసినట్లు సీపీ సజ్జనార్ చెప్పారు.

ఈ నాలుగు ముఠాలు కలిసి వివిధ బ్యాంకులకు సుమారు రూ.2.39 కోట్ల మేర టోకరా వేశారు. వీరి వద్ద నుంచి రూ.4లక్షల నగదు, 7 ల్యాప్‌టాప్‌లు, పలు బ్యాంకులకు చెందిన 200 క్రెడిట్ కార్డులు, 49 పాన్‌కార్డులు స్వాధీనం చేసుకున్నారు. మరో రూ.75లక్షలు బ్యాంకు ఖాతాల్లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితులకు పలువురు బ్యాంకు సిబ్బంది సహకరించినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. సహకరించిన బ్యాంకు సిబ్బందిని కూడా పట్టుకొని కేసుని క్షున్నంగా పరిశీలించి నిందితులకు తగిన శిక్ష పడేలా చూస్తామని పోలీసులు వెల్లడించారు.