సిఎం.. ఉమా లమధ్య గాలేరు అవినీతి రగడ..!

Sunday, November 22nd, 2015, 02:14:33 AM IST


ఆంధ్రప్రదేశ్ లో ఇద్దరు తెలుగుదేశం నేతల మధ్య కోల్డ్ వార్ నడుస్తున్నది. ఈ విషయం తాజాగా బయటపడింది. ఇటీవలే గాలేరు నగరి సుజల స్రవంతిలో తెలుగుదేశం పార్టీ ఎంపీ సిఎం రమేష్ కు చెందిన కంపెనీ పని వ్యయం 12 కోట్ల నుంచి 110 కోట్ల రూపాయలకు పెంచిన విషయం బయట పడింది. అయితే, ఈ విషయాన్ని ఏపి జనవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమా బయటపెట్టారనే అనుమానం రావడంతో.. సీఎం రమేష్ దేవినేని అవినీతిని బయట పెట్టేందుకు అవకాశం కోసం ఎదురు చూసినట్టు తెలుస్తున్నది.

ఇక, దేవినేని అవినీతి భాగోతం గురించి సిఎం రమేష్ ఏకంగా ఆర్ధికశాఖ ముఖ్య కార్యదర్శికి లేఖ వ్రాశారు. ఇప్పుడు ఇది రాష్ట్రంలో సంచలనంగా మారింది. ప్రభుత్వం చేపట్టిన అవుకు రిజర్వాయర్ సొరంగం పనులకు 401 కోట్ల రూపాయల ఖర్చు అవుతాయని, అంతకు మించి ఒక్క రూపాయి కూడా పెంచేందుకు ఒప్పుకోబోమని గతంలో ప్రభుత్వం చెప్పింది. అయితే, ఇటీవలే రిజర్వాయర్ కు అదనంగా మరో 44 కోట్ల రూపాయలను మంజూరు చేసింది. ఇదంగా జనవనరుల శాఖ మంత్రి దేవినేని కనుసన్నల్లోనే జరిగిందని.. కాంట్రాక్టర్ అడిగిన వెంటనే 44 కోట్ల రూపాయలు ఎందుకు కేటాయించాలో చెప్పాలని అంటూ.. సిఎం రమేష్ లేఖలో పెర్కొన్నారు.

గాలేరు విషయంలో అవినీతిని బయటపెట్టి రమేష్ కంపెనీకి 35 కోట్ల రూపాయలు గండికొట్టిన దేవినేనిపై ప్రతీకారం సిఎం ప్రతీకారం తీర్చుకున్నారని నేతలు అంటున్నారు. అయితే, ఒకే పార్టీకి చెందిన నేతలు ఇలా ఒకరిపై ఒకరు అవినీతిని బురద జల్లుకుంటుంటే.. ప్రజలు ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోస్తాయని నేతలు అంటున్నారు.