ప్రియుడు చేసిన తప్పు.. మూడు ప్రాణాలు బలి!

Friday, August 3rd, 2018, 06:20:54 PM IST

దాంపత్య జీవితంలో భార్యాభర్తల్లో ఏ ఒక్కరు తప్పటడుగు వేసినా కూడా అది కుటుంబం మొత్తానికి బాధను కలిగిస్తుంది. ఇటీవల కాలంలో అక్రమ సంబంధాల కారణంగా చాలా మంది జీవితాలు తారుమారవుతున్నాయి. ఇక చిన్నారుల భవిష్యత్తు కూడా ప్రశ్నార్ధకంగా మారుతోంది. ఇక రీసెంట్ గా పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డి గూడెంలో ఉహించని విధంగా ఒక విషాదమైన ఘటన చోటు చేసుకుంది. ఒక్క తప్పు వల్ల మూడు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.

వివరాల్లోకి వెళితే.. జంగారెడ్డి గూడేనికి చెందిన ఒక వ్యక్తికి రాజమండ్రి కి చెందిన యువతికి కొన్ని నెలల క్రితం వివాహమైంది. అయితే భార్యకు ఒక వ్యక్తితో సోషల్ మీడియా ద్వారా పరిచయం ఏర్పడింది. అనంతరం వారి మధ్య సాన్నిహిత్యం ఏర్పడింది. ఈ క్రమంలో ప్రియుడు భర్తకు ఫోన్ చేసి వెంటనే ఆమెను తనకు వదిలెయ్యాలని తను నన్ను ప్రేమిస్తోందని చెప్పడంతో భర్త తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. చివరికి బాధ తట్టుకోలేక గత నెల ఆత్మహత్య చేసుకున్నాడు. అనంతరం భార్య కూడా భర్త మరణాన్ని తట్టుకోలేకో గోదావరిలో దూకి ప్రాణాలను వదిలేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు మరణాలకు గల కారణలను తెలుసుకోవడానికి భార్యతో సంబంధం పెట్టుకున్న వ్యక్తిని విచారించగా.. అతను కూడా తన ఇంట్లో శుక్రవారం ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.