2007లో జరిగిన గోకుల్‌చాట్, లుంబినీ పార్కుల బాంబు పేలుళ్ల ఘటన తెలుగు ప్రజల్ని ఏ స్థాయిలో బయపెట్టిందో అందరికి తెలిసిందే. అయితే ఘటనపై మంగళవారం చర్లపల్లి కేంద్ర కారాగారం ఆవరణలో ఏర్పాటు చేసిన డెజిగ్నేటెడ్ న్యాయస్థానంలో ఈ విచారణ సాగింది. ఈ జంట పేలుళ్లలో అక్బర్ ఇస్మాయిల్ చౌదరి, అనీఖ్ షఫిక్ సయ్యద్లక సెక్షన్ 302 కింద అభియోగాలు నమోదవ్వడంతో విచారణ అనంతరం వారిని దోషులుగా ప్రకటించింది.
ఇక మరో ఇద్దరు సాదిక్ ఇష్రార్ షేక్, ఫారూఖ్ సర్ఫుద్దీన్ తర్ఖాష్‌లను నిర్దోషులుగా ప్రకటించింది, దోషులుగా తేల్చాడానికి ఆధారాలు లేకపోవడం వల్ల వారిపై ఉన్న అభియోగాలను న్యాయస్థానం కొట్టేసింది. వచ్చే సోమవారం తదుపరి విచారణ అనంతరం దోషులుగా తేల్చబడిన వారికి శిక్షలు ఖరారుకానున్నాయి. ఈ కేసులో మొత్తం 8 మంది ఉగ్రవాదులను నిందితులుగా పేర్కొనగా ముగ్గురు పరారీలో ఉన్నారు. మిగతా అయిదుగురి పై నేడు విచారణ జరిగింది.