క్రైమ్ కహాని : అమెరికాలో కాల్పులతో చంపితే.. ఇండియాలో యాక్సిడెంట్లతో చంపుతున్నారు

Thursday, June 16th, 2016, 12:58:25 PM IST

అమెరికాలో కాల్పులు : అమెరికాలోని ఫ్లోరిడా, ఆర్లాండోలో ఉన్న ఓ నైట్ క్లబ్ లో ఆదివారం తెల్లవారు జామున ఉగ్రవాద సానుభూతిపరుడైన మతీన్ అనే వ్యక్తి విచాక్షణారహితంగా కాల్పులు జరిపాడు. దీంతో క్లబ్ లో ఉన్న 53 మంది అక్కడికక్కడే మరణించారు. ఇప్పటి వరకూ అమెరికాపై జరిగిన అనెక్ ఉగ్రదాదుల్లో ఇదే అతిపెద్ద రెండవ దాడి. ఈ ఘటనతో యావత్ అమెరికా నిర్ఘాంతపోయింది. అమ్రికాలో గం కల్చర్ ఏ విధంగా ఉందో చెప్పడానికి ఇదో నిదర్శనం.

ఫుల్లుగా తాగి కార్లతో గుద్దుతున్నారు : ఈ మధ్య ఇండియాలోని ప్రధాన నగరాలైన ఢిల్లీ, బెంగళూరు, పూనే, ముంబై, హైదరాబాద్ వంటి చోట్ల యాక్సిడెంట్ కేసులు ఎక్కువయ్యాయి. వాటిలో ముఖ్యంగా డ్రంక్ అండ్ హిట్ కేసులు ఎక్కువ. ఫుల్లుగా మద్యం సేవించి ఖరీదైన వాహనాలను అదుపులేని వేగంతో నడిపి జనాలపైకి దూసుకొచ్చి వారి మరణాలకు కారణమవుతున్నారు. ఇటీవల ఢిల్లీలో రిషబ్ అనే యువకుడు మద్యం మత్తులో తన కారుతో 100 కి. మీ ల వేగంతో ముగ్గుర్ని డీ కొట్టగా వారిలో ఇద్దరు మరణించారు.

వీడియో కొరకు క్లిక్ చేయండి :

పిచ్చి అభిమానంతోనే కాల్చి చంపాడు : ప్రముఖ యూట్యూబ్ గాయని క్రిస్టినా గ్రిమ్మీ ఓర్లాన్దోలోని ఓ ప్లాజాలో తన గాన ప్రదర్శన ఇచ్చి బయటకోస్తుండగా అభిమానులు ఆమెతో ఆటోగ్రాఫులు తీసుకోవడానికి ఆమె చుట్టూ గుంపుగా చేరారు. ఆ గుంపులోనే ఉన్న జేమ్స్ జాయిబ్స్ అనే వ్యక్తి ఆమెను అతి దగ్గర్నుంచి కాల్చి అదే తుపాకితో తనను తాను కాల్చుకుని చనిపోయాడు. అయితే ఇతను ఈ దారుణానికి పాల్పడడానికి ఆమె పై అతనికున్న పిచ్చి అభిమానమే కారణమని పోలీసులు చెబుతున్నారు.