క్రైమ్ కహానీ : భార్యను మారుస్తాడు.. బీరువాలో శవాన్ని దాచిపెట్టాడు.. తుపాకీతో కాల్చుకుని చనిపోయాడు

Wednesday, February 10th, 2016, 11:30:24 PM IST

12 ఏళ్లకోసారి భార్యను మార్చేస్తాడు : అతగాడి పేరు హరోల్ద్.. ఉండేది కొలరాడో. అతనికో వింత స్వభాముంది. పెళ్లి చేసుకున్న భార్యను 12 ఏల్లకోసారి మార్చేస్తుంటాడు. మార్చడమంటే.. విదాకులివ్వడం కాదు ఏకంగా చంపేయడం. తరువాత ఆ హత్యను ప్రమాదంగా చిత్రీకరించడం. ఇతను 1983 లో లియాన్ ను పెళ్లి చేసుకున్నాడు. సరిగ్గా 12 సంవత్సరాల తరువాత అంటే 1995 వ సంవత్సరంలో 12 వ పెళ్లిరోజున భార్యకు డిన్నర్ పేరు చెప్పి బయటకు తీసుకెళ్ళి చంపేశాడు. పోలీసులకు అనుమానం రాకుండా ఆత్మహత్యగా చిత్రీకరించాడు. ఆతరువాత 2000వ సంవత్సరంలో టోనీ అనే మహిళను పెళ్ళాడి ఆమెను కూడా 2012 లో కొండమీదకు తీసుకెళ్ళి కిందికి తోసి చంపేశాడు. దాన్ని కూడా ఆత్మహత్యగా చిత్రకరించే ప్రయత్నం చేశాడు. కానీ పోలీసులకు అనుమానం రావడంతో దొరికిపోయి కటకటాల పాలయ్యాడు.

ప్రియురాలిని చంపి బీరువాలో దాచేశాడు : ఢిల్లీ లో నివసించే నవీన్ అనే యువకుడు తన ప్రియురాలు అయిన 21 ఏళ్ళ ఆర్జూ అనే అమ్మాయిని దారుణంగా చంపేసి మృతదేహాన్ని తన ఇంట్లోని బీరువాలో దాచాడు. చివరకు పోలీసులకు దొరికిపోయాడు. వివరాల్లోకి వెళితే నవీన్, ఆర్జూలు ప్రేమించుకుంటున్నారు. కానీ నవీన్ మాత్రం మరో యువతిని పెళ్లి చేసుకోవడానికి సిద్దమవడంతో.. ఆ విషయం తెలుసుకున్న ఆర్జూ అడ్డుకోవడానికి ప్రయత్నించింది. దీంతో కోపానికి లోనైనా నవీన్ ఆమె అడ్డును ఎలాగైనా తొలగించుకోవాలని భావించి దారుణంగా చంపేసి తన ఇంట్లోని బీరువాలోనే దాచేశాడు. చివరికి ఇంటరాగేషన్ లో పోలీసులకు దొరికిపోయాడు.

 

ముగ్గురు డాక్టర్లు.. ఒక తుపాకి : హైదరాబాద్ లోని హిమాయత్ నగర్ లో హాస్పిటల్ వాటాల విషయంలో ఇద్దరు డాక్టర్ల మధ్య జరిగిన కాల్పుల్లో డాక్టర్ ఉదయ కుమార్ తీవ్రంగా గాయపడి హైదర్ గూడలోని అపోలో ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడి చివరికి మరణించాడు. ఈ కేసులో ప్రాధాన్ ఆరోపణలు ఎదుర్కొన్న డాక్టర్ శశికుమార్ మాత్రం తన స్నేహితురాలి ఫామ్ హౌస్ లో అదే తుపాకీతో కాల్చుకుని చనిపోయాడు. అతను రాసిన సూసైడ్ నోట్లో ఉదయ కుమార్ ను తానూ కాల్చలేదని పేర్కొన్నాడు. అతని భార్య కూడా శశి కుమార్ ను ఎవరో చంపారని ఆరోపిస్తోంది. దీంతో ఈ కేసు మిస్టరీగా మారి పెద్ద సంచలనం రేపింది.

వీడియో కొరకు క్లిక్ చేయండి