క్రైమ్ కహానీ : ముగ్గురు సైకోలు..మూడు మారణ కాండలు

Thursday, December 24th, 2015, 10:15:58 AM IST

క్రాఫ్ నచ్చలేదని కుటుంబాన్ని నరికేశాడు: రష్యాకి చెందిన ఓలెగ్ బెలోవ్ అనే వ్యక్తి తన భార్య, ఆరుగురు పిల్లలతో కలిసి అక్కడ ఓ ప్రాంతంలో స్థానికంగా నివసిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే, తాజాగా ఓలెగ్ భార్య తమ ఆరేళ్ళ కొడుక్కి విభిన్నంగా జుత్తు కత్తిరించిందట. ఆ తర్వాత ఆ హెయిర్ స్టైల్ ఓలెగ్ కు నచ్చకపోవడంతో భార్యాభర్తల మధ్య పెద్ద గొడవ జరిగిందట. దీంతో సైకోగా మారిన ఒలెగ్ గర్భవతి అయిన భార్యను, తన ఆరుగురు పిల్లల్ని గొడ్డలితో నరికి చంపేశాడు.

12 సంవత్సరాలు..12 ముక్కలు: మహమ్మద్ రైజ్ అనే వ్యక్తి తనకు12సం.ల వయసున్నప్పుడు తన తండ్రిని దారుణంగా నరికి చంపిన వ్యక్తి పై పగబట్టాడు. ఓపిగ్గా 12సం.లు వెయిట్ చేశాడు. అన్నేళ్ళూ తనలో ఉన్న పగను లోపలే తొక్కిపట్టి బయటికి కనిపించని సైకోలా మారాడు. చివరికి సమయం దొరకగానే అనుకున్న ప్లాన్ ను వర్కవుట్ చేశాడు. వర్కవుటంటే మాములుగా కాదు. తను వెయిట్ చేసిన ఒక్కో సంవత్సరానికి ఒక్కో ముక్క లెక్కన తన తండ్రిని చంపిన వాడిని 12 ముక్కలుగా తెగ నరికాడు.

సాఫ్ట్ వేర్ సైకో: ఇతగాడు బాగా చదువుకున్న వ్యక్తి. పేరు బల్విందర్ సింగ్. బెంగుళూరులో సంవత్సరానికి 18 లక్షల జీతానికి పని చేస్తున్నాడు. సొంత ఊరు కరీంనగర్. గతంలో సివిల్స్ ర్యాంక్ కాస్తలో మిస్సవటం, ప్రేమ వ్యవహారం తలకిందులవటం వంటి కారణాలతో తీవ్ర మానసిక వ్యధకు గురైన ఇతగాడు రాక్షసుడిలా మారాడు. నాలుగు రోజుల క్రితమే ఇంటికి వచ్చిన అతను ఇంట్లో గొడవపడి తల్లిదండ్రులను తల్వార్ తో నరికి బయటికొచ్చి పోలీసులతో పాటు 15మందిని గాయపరిచాడు. దీంతో ఆ ఏరియా సీఐ అతన్ని తన సర్వీస్ రివాల్వర్ తో కాల్చి చంపాడు.