క్రైమ్ కహాని : టీచర్ విద్యార్ధితో పారిపోతే.. జనసేన నాయకుడిని అరెస్ట్ చేశారు..!?

Thursday, March 17th, 2016, 03:59:02 AM IST

చదువు చెప్పాల్సిన టీచర్ అలా చేసిందా : సంవత్సరం క్రితం తమిళనాడులోని తిరున్వేలిలో ఓ ప్రవేట్ హైస్కూల్ లో పనిచేసే టీచర్.. తన కన్న చిన్నవాడైన 15 సంవత్సరాల స్టూడెంట్ తో కలిసి ఊరు వదిలివెళ్లి పెళ్లిచేసుకున్నారు. ఇక ఇద్దరు రహస్యంగా పెళ్లి చేసుకొని తిరుపూర్ సమీపంలో కాపురం పెట్టారు. ఇద్దరు ఓ రైస్ మిల్లులో ప అనిచేస్తూ.. జీవనం సాగిస్తున్నారు. మిల్లులో పనిచేస్తూ.. అప్పుడప్పుడు ఓ టెలిఫోన్ నుంచి ఆమె స్నేహితులకు ఫోన్ చేస్తుంటారు. అయితే, వీరిద్దరూ లేచిపోయిన తరువాత అబ్బాయి తల్లిదండ్రులు పోలీసు కేసు పెట్టారు. అయితే, తరుచుగా చేసే ఫోన్ నెంబర్ ఆధారంగా వారిద్దరిని పోలీసులు పట్టుకున్నారు. అయితే, ప్రస్తుతం సదరు యువతి గర్భవతి. ఇక ఈ యువతిపై పోలీసుల చైల్డ్ రేప్, కిడ్నాప్, బాలల లైంగిక వేదింపుల కింద కేసులు నమోదు చేశారు.

సెల్ఫీ కోసం హింసించి ప్రాణం తీసింది : స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి వచ్చాక, జనాలలో సెల్ఫీ పిచ్చి మరింతగా పెరిగింది. ఈ సెల్ఫీ పిచ్చి ఎంతగా మారింది అంటే.. సెల్ఫీల కోసం మూగజీవాలను చంపేందుకు కూడా వెనుకాడటంలేదు. యూరప్ లోని బల్గేరియా దేశంలో మెసడోనియాలో ఓ చిన్న సరస్సు ఉన్నది. అక్కడికి ఓ పర్యాటకురాలు వచ్చింది. ఆ సరస్సు ఒడ్డున.. సదరు పర్యాటకురాలు కాసేపు సేదతీరింది. అయితే, ఆ సమయంలో సరస్సులో ఉన్న తెల్ల హంసను రెక్కలు పట్టుకొని బయటకు ఈడ్చుకొని వచ్చి సెల్ఫీ దిగటం మొదలు పెట్టింది. పాపం ఆ హంస ఆమె హింసకు తట్టుకోలేక విలవిలలాడింది. ఇష్టం వచ్చినంతసేపు సెల్ఫీలు దిగి అక్కడినుంచి వెళ్ళిపోయింది. అలా అక్కడ వదిలేసి వెళ్ళిన ఆ హంస కాసేపటి మరణించింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.

జనసేన పరువుతీసిన టెక్కీ : జనసేన పార్టీలో క్రియాశీలంగా ఉన్న ఓ వ్యక్తి పేస్ బుక్ లో అమ్మాయితో పరిచయం పెంచుకొని వాళ్లతో చాటింగ్ చేయడం మొదలు పెట్టాడు. అలా అలా ఆ పరిచయాన్ని స్నేహంగా.. చివరకు ప్రేమగా మార్చుకున్నాడు. తనను పెళ్లి చేసుకోవాలని పాపం యువతిని బలవంతం చేశాడు. అందుకు సదరు యువతి నిరాకరించింది. అంతే ఆమెతో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి బ్లాక్ మెయిల్ చేయడం మొదలు పెట్టాడు. దీంతో సదరు యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు చంద్రశేఖర్ అనే టెక్కీని గుర్తించి అరెస్ట్ చేశారు.