క్రైమ్ కహాని : ఒకడు 12మంది ఆడపిల్లల్ని బలాత్కరిస్తే .. మరికొందరు అమ్మాయి చేత యాసిడ్ తాగించారు

Thursday, June 23rd, 2016, 08:16:54 AM IST

మృగమై 12 మందిని బలాత్కరించాడు : ఇంగ్లాండ్, పెన్సిల్వేనియా ప్రాంతంలో లీ కప్లాన్ అనే 51 ఏళ్ల వ్యక్తి తన ఇంట్లో 12 మంది అమ్మాయిల్ని నిర్బంధించి వారిపై తన లైగిక వాంఛనూ తీర్చుకుంటూ గడిపేవాడు. కొన్నాళ్లుగా అతడిపై ఉన్న అనుమానంతో పొరుగింటి వాళ్ళు పోలీసులకు తెలపగా వాళ్ళు వచ్చి అతై ఇంటిని సోడా చేస్తే ఆ 12 మంది అమ్మాయిలతో పాటు ఇద్దరు చిన్న బిడ్డలు కూడా దొరికారు. అతడి పైశాచికత్వానికి ఓ 14 ఏళ్ల అమ్మాయి ఆ బిడ్డలకు జన్మనిచ్చింది. ఈ ఉదంతమంతా తెలుసుకున్న పోలీసులు అతడిని అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు.

అమ్మాయిలే అమ్మాయి చేత యాసిడ్ తాగించారు: ఆడవాళ్లపై మగాళ్ల దారుణాలు ఎక్కువవుతున్నాయి అనుకుంటే మహిళలే మహిళల్ని వేధించడం కలతకు గురిచేస్తోంది. ముఖ్యానంగా కాలేజీలు, ఆఫీసుల్లో ఆడవాళ్లే ఆడవాళ్ళని వేధింపులకు గురిచేయడం జరుగుతోంది. తాజాగా కర్ణాటకలోని గుల్బర్గా ఆల్ ఖమర్ నర్సింగ్ కాలేజీలో కొందరు విద్యార్థినులు కలిసి మరొక విద్యార్థిని చేత ర్యాగింగ్ పేరుతో బాత్రూములు కడిగే యాసిడ్ తాగించారు. దీంతో ఆ యువతి శరీరంలోపలి భాగాలు కాలి పరిస్థితి విషమించింది.


పరువు కోసం ముగ్గురి తలలు నరికారు : పాకిస్థాన్ లో పరువు హత్యలు మరోసారి వెలుగుచూశాయి. కారణం చిన్నదైనా సరే పాకిస్థాన్ లో పెద్ద శిక్షలే ఉంటాయి. ఈ పద్దతే ఓ నిండు కుటుంబం తలలు నరికింది. పాకిస్థాన్ లోని పంజాబ్ రాష్ట్రంలో భర్త, భార్య, వాళ్ళ 4 ఏళ్ల కొడుకును బంధించిన దుండగులు భారత నోట్లో తుపాకీ పెట్టి మూడు రౌండ్ల కాల్పులు జరపగా భార్యా, వాళ్ళ బిడ్డ తలల్ని గొడ్డలితో నరికేశారు. ఈ ఘటనతో మరోసారి పాక్ లో పరువు హత్య వాతావరణం నెలకొంది.