జయరామ్ హత్యకేసు: కొత్త ట్విస్ట్ – “ఆ నలుగురు” నటుడిపై అనుమానం..!

Thursday, February 14th, 2019, 08:25:16 AM IST

ప్రముఖ పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరామ్ హత్యకేసులో రోజులు గడిచేకొద్దీ కొత్త మలుపులు తీసుకుంటూ విస్తుపోయే నిజాలు వెలుగలోకి వస్తున్నాయి. రోజుకో మలుపు తిరుగుతున్న ఈ కేసులో తొలుత జయరామ్ మేనకోడలు శిఖా చౌదరిని అనుమానించారు, ఆ తర్వాత ఆమె ఫ్రెండ్ రాకేశ్ రెడ్డి ఈ హత్యకు పాల్పడినట్టు నిర్ధారించారు. తాజాగా, ఈ హత్య కేసులో “ఆ నలుగురు” ఫెమ్ సూర్య ప్రసాద్ ప్రమేయం కూడా ఉన్నట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేయటంతో ఈ కేసులో మరింత అయోమయం చోటు చేసుకుంది.

రాకేష్ రెడ్డి, సూర్యప్రసాద్ మధ్యన స్నేహం ఉండటం, హత్యకు ముందు సూర్యతో ప్రసాద్ ఫోన్లో మాట్లాడినట్టు తేలడంతో పోలీసులు ఈ కోణంలో విచారిస్తున్నారు. మరోవైపు, హత్య జరిగిన రోజైన జనవరి 30న రాకేశ్ ఇంటికి సూర్య వచ్చి వెళ్లినట్టు తెలుస్తోంది. దీంతో సూర్యను పిలిపించిన బంజారాహిల్స్ పోలీసులు బుధవారం అతడిని విచారించారు. ఈ కేసులో అనుమానితులైన మరికొంత మందిని ఈరోజు విచారణకు పిలిపించనున్నట్లు పోలీసులు తెలిపారు.